ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, మరో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు గాలులు వీయడం వల్ల జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

next three days normal to moderate rainfall in andhra pradesh districts

దక్షిణ కోస్తాంధ్రలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారంనాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు, రాయలసీమలోనూ శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారంనాడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు మూడు రోజుల క్రితం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+