బాబుకు ఝలక్: పోలవరంపై సుప్రీంకు 'రేలా', ఏపీ-తెలంగాణకు నోటీసులు
పోలవరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్! ప్రాజెక్టు నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వడం లేదని 'రేలా' అనే స్వచ్చంధ సంస్థ శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్! ప్రాజెక్టు నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వడం లేదని 'రేలా' అనే స్వచ్చంధ సంస్థ శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలవరం ప్రాజెక్టుపై సరైన పర్యవేక్షణ లేదని ఈ సంస్థ పిటిషన్‌లో పేర్కొంది.

నిర్వాసితులకు సరైన నష్ట పరిహారం చెల్లించలేదని, అటవీ హక్కుల చట్టం ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్జీటీలో పోలవరంపై పిటిషన్ల విచారణను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
దీనిపై స్పందించిన జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలవరంపై సుప్రీం కోర్టులో దాఖలైన మొదటి పిటిషన్‌తో కలిపి దీనిని విచారిస్తామని చెప్పింది. దీనిపై ఏపీ, తెలంగాణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.












Click it and Unblock the Notifications