రాజీనామా చేసిన వాలంటీర్ల పై ఈసీకి నిమ్మగడ్డ మరో ఫిర్యాదు..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాలంటీర్ల పైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరో ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్ల పైన సంస్థ ప్రతినిదులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
ఏజెంట్లుగా కూర్చోరాదు
ఏపీలో వాలంటీర్ల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది. రాష్ట్రంలో రాజీనామా చేసిన వలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామమోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు.రాజీనామాలు చేస్తున్న వలంటీర్లు రేపు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ రామమోహన్ మిశ్రాతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్యం ఎన్నికల ముందు కాదని, ఆ తరువాతే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

ఈసీకి ఫిర్యాదు
వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని తమ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వారిని ఆ విధుల నుంచి తప్పించిందని నిమ్మగడ్డ, ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కనీసం మే నెలలో అయినా 1, 2 తేదీలలోనే పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని రామమోహన్ మిశ్రాను కోరినట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
సలహాదారుల పైన చర్యలు
ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున వారు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఏపీలో 40 మంది సలహాదారులు ఉన్నారు. వారిలో 13 మందికి కేబినెట్ హోదా ఉందన్నారు. జీతాలు తీసుకుంటున్నవారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని చెప్పారు. ఏ ఉద్యోగి అయినా అలా చేస్తే విధుల నుంచి సస్పెండ్ చేస్తారని పేర్కొన్నారు. అవే నిబంధనలు సలహాదారులకు కూడా వర్తిస్తాయని వివరించారు. రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరితే, వివరణ కోరామని చెప్పారు. సలహాదారుల పై చర్యలు తీసుకోకుంటే తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని స్పష్టం చేసారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications