జగన్ సర్కార్ ను వదిలిపెట్టని నిమ్మగడ్డ .. కోర్టు ధిక్కరణ పిటీషన్ లో ప్రతివాదిగా సీఎస్ , వారు కూడా
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏమాత్రం సఖ్యత కుదరడంలేదు. పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామని చెబుతూనే, సహకారం అందించకుండా ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం తో కలిసి పని చేస్తామని చెబుతూనే, అడుగడుగున ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో రచ్చను కొనసాగిస్తున్నారు.

హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ
ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో గవర్నర్ కు , ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖాస్త్రాలు సంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ ప్రభుత్వం పై మరోమారు యుద్ధం ప్రకటించారు. వైయస్ జగన్ ప్రభుత్వం పై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిటిషన్ పై విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రతివాదిగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను చేర్చడానికి అనుమతి ఇచ్చింది.

జగన్ సర్కార్ లోని ముఖ్యులను టార్గెట్ చేసిన ఎస్ఈసి .. ఎన్నికలకు సహకరించటం లేదని ఆరోపణలు
పంచాయతీ ఎన్నికల విషయంలో తనకు సహకరించని ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ని కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల నిర్వహణకు తమకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.

సోమవారం విచారించనున్న హైకోర్టు .. ఎన్నికల రద్దుకు వేసిన పిటీషన్లు కొట్టివేత
అయితే నేడు రేపు కోర్టుకు సెలవు దినాలు కావడంతో సోమవారం నాడు ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. ఇక మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఓటర్ల జాబితా సవరణ చేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎన్నికల నిర్ణయంతో చాలామంది ఓటు హక్కును కోల్పోతున్నారని ఎన్నికలను రద్దు చేయాలని పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసినా , ఈ దశలో ఎన్నికలను రద్దు చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది.

జగన్ క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డ లేఖాస్త్రాలు
ఎన్నికల రద్దు కోరుతూ దాదాపుగా హైకోర్టులో 10 పిటిషన్లు దాఖలైన ట్లుగా సమాచారం. దీంతో ఎన్నికలను అడ్డుకోవాలని చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించ కుండా పోయింది.
ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల్లో రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తూ అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు జగన్ క్లోజ్ సర్కిల్ అందరిని టార్గెట్ చేస్తున్నారు. పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది పై, గిరిజాశంకర్ పై చర్యలు తీసుకోవాలని సి ఎస్ కు లేఖ రాశారు.

ఏకంగా హైకోర్టు మెట్లెక్కిన నిమ్మగడ్డ .. ఏపీ ఎన్నికలు హాట్ టాపిక్
ప్రవీణ్ ప్రకాష్ ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఎస్ కు సూచించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్ససత్యనారాయణ విజయసాయి రెడ్డి పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రభుత్వ పెద్దలందరినీ టార్గెట్ చేస్తూ చివరకు కోర్టు ధిక్కరణ కు పాల్పడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఒకపక్క ఎన్నికల నిర్వహణ విషయంలో బిజీగా పర్యటనలు చేస్తూనే, మరోపక్క ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.
దీంతో ఏపీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications