ఆకులెత్తేసేవారితో...: పవన్ కల్యాణ్‌పై నిమ్మల వివాదం, జగన్‌పై టిడిపి ఫైర్
పవన్ కల్యాణ్‌పై ఎంపి నిమ్మల కిష్టప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జగన్‌పై టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు.
గుంటూరు/ కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మశాలీలు అన్నం పెట్టే వారి దగ్గరికి వెళ్ళకుండా ఆకులెత్తేసే వారి దగ్గరకు వెళ్లారని వ్యాఖ్యానించారు. అతని వల్ల ఏమీ సాధ్యం కాదంటూ జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పద్మశాలీల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇటీవల పద్మశాలీలు పవన్‌ను కలిసి తమ సమస్యలను ఆయనకు వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిమ్మల కిష్టప్ప ఆ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే, వైఎస్ జగన్‌పై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ రాత్రి, పగలు కలలు కంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కలలు కనడం తప్ప మరో దారి లేదని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.

తన తల్లిని లక్షన్నర ఓట్లతో అవమానకర రీతిలో విశాఖవాసులు ఓడించారన్న కోపంతో జగన విశాఖను మరో తునిలా మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నాడని, దీనిని ప్రభుత్వ యంత్రాంగం సమర్ధ వంతంగా అడ్డుకుందని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీని వాసరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్ర వారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే, నిరసనల ముసుగులో అసాంఘిక చర్యలకు పాల్పడతామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. 50దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ముఖ్యమంత్రిని నమ్మి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నా రని, అవన్నీ అమల్లోకొస్తే తన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారుతుందనే దుర్మార్గపు ఆలోచనతో జగన్ వ్యవహరిస్తున్నాడని వారన్నారు.
దేశం మొత్తం గణతంత్ర దినోత్సవాలను జరుపుకొం టుంటే విశాఖవాసులకు ఆ ఆనందం దక్క కుండా చేయాలన్న జగన్ ప్రయత్న న్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ భ్రమ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, దీంతో తనకు తాను దైవాంశ సంభూతుడిగా ఊహించుకుంటున్నాడని అన్నారు.
జగన్ అంగీకరిస్తే ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత చికిత్స అందిస్తామని అన్నారు. ఇటువంటి మనస్తత్వం గలవారు టెర్రరిస్టుల కంటే ప్రమాదక రమని వారు వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా వచ్చే అవకాశమే లేదని జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని సాధించామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications