వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్‌ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.. రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లు ఉంది అని నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. కూచిపూడి నాట్యకారిణిలా మడమా తిప్పుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మండలిపై సీఎం హత్యా యత్నం చేశారని ఆయన విరుచుకుపడ్డారు.

వ్యవస్థల్ని మర్డర్‌ చేయడంలో జగన్ సిద్ధహస్తులు

వ్యవస్థల్ని మర్డర్‌ చేయడంలో జగన్ సిద్ధహస్తులు

సీఎం జగన్ వ్యవస్థల్ని మర్డర్‌ చేయడంలో సిద్ధహస్తులని ఆగ్రహం వ్యక్తం చేశారు . మండలిని రద్దు చేయడం అంటే అన్ని సామాజిక వర్గాల మీద దాడి చెయ్యటం అని ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడి చేయడమేనని రామానాయుడు తప్పుబట్టారు. ఉద్యోగసంఘాల గొంతు మండలిలో వినిపించే అవకాశం లేకుండా చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.

మండలిని రద్దు చేయడమంటే బలహీనవర్గాల గొంతునొక్కడమే

రజక, ఈడిగ, యాదవ, శెట్టిబలిజలాంటి వెనుకబడిన కులాల ప్రతినిధులంతా మండలిలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన జగన్ నిరనయంతో ఇన్ని కులాల వారికి అన్యాయం జరుగుతుంది అన్నారు.. 58 మందితో సగానికిపైగా బడుగు, బలహీనవర్గాలతో నిండిన మండలిని రద్దు చేయడమంటే వాళ్ల గొంతునొక్కడమేనని రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . బీసీ గర్జన, బీసీ డిక్లరేషన్‌ అన్న జగన్‌.. బీసీలకు అన్యాయం చేసే విధంగా మండలిని రద్దుచేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ కు 23 మంది సలహాదారులు.. దుబారా గురించి చెప్తున్నారని ఎద్దేవా

జగన్ కు 23 మంది సలహాదారులు.. దుబారా గురించి చెప్తున్నారని ఎద్దేవా

జగన్‌కు భవిష్యత్‌లో బీసీలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలు ఎవరూ జగన్‌ను క్షమించరు. బీసీ, ఎస్సీలను జగన్‌ అణగదొక్కుతున్నారని నిమ్మల పేర్కొన్నారు . కేబినెట్‌ ర్యాంక్‌ ఉన్న 23 మందిని సలహాదారులుగా నియమించుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దుబారా గురించి మాట్లాడుతున్నారు. 23 మందిలో 19 మంది తన సామాజికవర్గం వాళ్లే ఉన్నారని నిమ్మల రామానాయుడు సీఎం జగన్ తీరును ఎండగట్టారు.

English summary
MLA Nimmala Rama naidu is outraged Jagan at the willingness to suppress systems. He said that abolishing the council means attacking all social classes. Ramanaidu was alleged that this is nothing but attack on SC, ST, BC and the minority. Nimmala Rama naidu said that BCs will teach a lesson to Jagan in future .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X