Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీనేతలు నిమ్మల, చింతమనేని గృహనిర్బంధం.. ఉద్రిక్తత; జగన్ పాలనపై టీడీపీ నిప్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోలవరం యాత్రను, అమరావతి యాత్రను చేపట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టిడిపి నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం యాత్రను అడ్డుకునే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

నిమ్మల రామానాయుడు గృహ నిర్బంధం

నిమ్మల రామానాయుడు గృహ నిర్బంధం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలను ఎక్కడికి కూడా పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: ఎమ్మెల్యే నిమ్మల

చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: ఎమ్మెల్యే నిమ్మల

పోలీసులు తమను అడ్డుకుంటున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఇప్పుడు అమరావతి లేదని, పోలవరం పరిస్థితి దారుణంగా ఉందని నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు.

నాడు చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి చేస్తే , నేడు జగన్ నాశనం చేస్తున్నాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. నాడు అమరావతికి జై అన్న జగన్ నేడు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు నాడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అని చెప్పి, నేడు కనీసం పది రూపాయలు కూడా ఇవ్వడం లేదంటూ నిమ్మల రామానాయుడు ఆరోపణలు గుప్పించారు.

జగన్ పాలనలో అమరావతి అటకెక్కింది.. పోలవరం పడకేసింది: నిమ్మల రామానాయుడు

జగన్ పాలనలో అమరావతి అటకెక్కింది.. పోలవరం పడకేసింది: నిమ్మల రామానాయుడు

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనం అయిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి మహాసభకు అడ్డంకులు సృష్టిస్తూ, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమని అడిగినందుకు అక్రమ నిర్బంధాలు చేయడం సిగ్గు చేటు అంటూ నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్ 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు.

జగన్ పాలనలో అమరావతి అటకెక్కింది అని, పోలవరం పడకేసింది అని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితుల నిరసన దీక్షలు చేపడితే, అమరావతి రైతులు రోడ్డెక్కారు అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జగన్ సర్కార్ ను విమర్శించారు. జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని నిమ్మల రామానాయుడు హెచ్చరికలు జారీ చేశారు.

చింతమనేని ప్రభాకర్ గృహ నిర్బంధం ... పోలీసులతో చింతమనేని వాగ్వాదం

చింతమనేని ప్రభాకర్ గృహ నిర్బంధం ... పోలీసులతో చింతమనేని వాగ్వాదం

ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్ ను పోలవరం నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు గృహ నిర్బంధానికి గురిచేశారు. దీంతో చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలవరం వెళ్లాలనుకున్న టిడిపి నేతలను నిర్బంధానికి గురిచేస్తున్న పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తాను పోలవరం వెళ్లడం లేదని పెళ్లికి వెళుతున్నా అని మాజీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోకుండా గృహ నిర్బంధానికి గురిచేశారు.

ఇప్పటికే జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకుల అరెస్ట్

ఇప్పటికే జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకుల అరెస్ట్

దీంతో పోలీసులకు చింతమనేని ప్రభాకర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం తర్వాత చింతమనేనిని బయటకు వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు ఆయనను అనుసరిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ పోలవరం వెళ్లే అవకాశం ఉంటే కచ్చితంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+