నిద్రమాత్రలు మింగి నిమ్స్ వైద్యుడి భార్య ఆత్మహత్య

తన భార్య కనిపించడం లేదని శేషగిరి రావు నవంబర్ 28వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిలో చెప్పకుండా యాత్రలకు వెళ్లే అలవాటు విజయలక్ష్మికి ఉంది. దీంతో ఆమె అలానే వెళ్లి ఉంటుందని భావించి కుటుంబ సభ్యులు మంత్రాలయం, శ్రీశైలం వంటి ప్రాంతాల్లో అన్వేషించారు.
స్టోర్ రూంలోంచి దుర్వాస వస్తున్న విషయాన్ని గమనించి పని మనిషి కుటుంబ సభ్యులకు చెప్పింది. స్టోర్ రూం తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో బలవంతంగా తెరిచారు. తలుపు తెరవగానే కుళ్లిన స్థితిలో విజయలక్ష్మి శవం బయటపడింది.
విజయలక్ష్మి ఓ నోట్ రాసి పెట్టింది. తన తండ్రి ఏడాది మరణించినప్పటి నుంచి తాను తీవ్ర నిస్ప్పహకు గురయ్యానని, దాంతో జీవితం చాలించాలని అనుకున్నానని అందులో రాసింది. పోస్టుమార్టం కోసం శవాన్ని అస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications