పాలకొల్లులో నిర్మల, సచిన్ రాకతో ప్రజల ఉబ్బితబ్బిబ్బు
నెల్లూరు/ఏలూరు: కేంద్ర వాణిజ్య శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పాలకొల్లులో పర్యటించారు. ఉదయం ఆడ శిశువులను కాపాడాలనే నినాదంతో సేవ్ గర్ల్ పేరిట 2కే రన్ జరిగింది. దీనిని ఆమె ప్రారంభించారు. ఈ రన్‌లో పాఠశాలల విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్పంచుకుంది.
లింగ నిర్థారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలను నివారించాలని ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆమె ఏపీలోని పెదమైనవానిలంక, తూర్పుతాళ్ల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తాను దత్తత తీసుకున్న గ్రామాలను మూడేళ్లలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పీఎం లంక, తూర్పు తాళ్ల గ్రామాల వెబ్ సైట్ ప్రారంభిస్తానని చెప్పారు. సముద్రపు కోత నివారణకు నిపుణులతో అధ్యయనం చేయిస్తామన్నారు.
సచిన్ రాకతో ఉబ్బితబ్బిబ్బు

రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుట్టంరాజువారికండ్రిగకు వచ్చిన విషయం తెలిసిందే. సచిన్ రాకతో గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయనను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని సచిన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని భావించానని ఆయన గ్రామంలో విలేకరులతో మాట్లాడుతు చెప్పారు.
సచిన్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారికండ్రిగ గ్రామంలో ఉన్న ఇళ్ల సంఖ్య కేవలం వంద మాత్రమే. జనాభా కూడా 600లకు మించదు. ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకున్న సచిన్.. ఏడాదిలో దాదాపుగా రూ.3.5 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేబడతారు.
కాగా, సచిన్ గ్రామంలో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పర్యటిస్తారని భావించినప్పటికీ, రెండు గంటలు ముందుగానే ముగిసింది. అనంతరం సచిన్ పుట్టంరాజువారికండ్రిగ కనుండి చెన్నై బయలుదేరి వెళ్లారు. చెన్నై నుండి విమానంలో ముంబై చేరుకుంటారు.












Click it and Unblock the Notifications