ఏపీలో గూగుల్ నెత్తిన పాలు.. డేటా సెంటర్లకు కేంద్రం భారీ శుభవార్త

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్లో శుభవార్త చెప్పారు. భారతదేశంలో 2047 వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు టాక్స్ హాలిడే ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు గుడ్ న్యూస్

భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలో టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో డేటా వినియోగం బాగా పెరుగుతుంది.

nirmala sitharaman announced tax holiday to data centers in india along with upcoming google data center

అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు ఆకర్షితులయ్యేలా ప్లాన్

డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ సేవలు, ఈ కామర్స్ వంటి రంగాలలో భారీగా డేటా నిల్వ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా డేటా సెంటర్లో ఏర్పాటు అనివార్యంగా మారిన క్రమంలో అంతర్జాతీయ సంస్థలను భారత్ వైపు ఆకర్షించేలా చేయడం కోసం బడ్జెట్లో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు నిర్మల సీతారామన్. ట్యాక్స్ హాలిడే వంటి ప్రోత్సాహకాలతో అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు.

ఏపీలో ఆ డేటా సెంటర్ కు స్వీట్ న్యూస్

ఇప్పటికే ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న క్రమంలో తాజాగా నిర్మల సీతారామన్ ప్రకటన google కు శుభవార్త అని చెప్పాలి. గూగుల్ మాత్రమే కాదు, రైడెన్ ఇన్ఫో డేటా సెంటర్, మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ఈ నిర్ణయంతో రెడ్ కార్పెట్ పరిచింది. టాక్స్ హాలిడే ప్రకటించి కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా విదేశీ పెట్టుబడులు పెరగడమే కాకుండా, దేశంలో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా సృష్టించబడతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

డేటా సెంటర్ లలో వేలాది ఉద్యోగాలు

ఐటీ, ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, డేటా లోకలైజేషన్‌కు ఇది తోడ్పడుతూ, దేశ భద్రత పరంగా కూడా కీలకంగా మారనుందని తెలుస్తుంది. డేటా సెంటర్లో ఏర్పాటు జరిగితే విద్యుత్, మౌలిక వసతులు, భూసేకరణ వంటి రంగాలలో అభివృద్ధి వేగవంతమవుతుంది.

భారత్‌ను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చే ప్లాన్

ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ద్వారా భారత్‌ను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ టాక్స్ హాలిడే నిర్ణయంతో క్లౌడ్ సేవలు సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+