ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా కేంద్రం గుడ్ న్యూస్..!!
ఎన్నికల వేళ ఏపీలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో తిరిగి పొత్తుల దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల పొత్తులు రిటీప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పుడు నీతి అయోగ్ విశాఖ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కోసం ప్రత్యేకంగా ఆర్దిక ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా విశాఖ రూపు రేఖలు మారనున్నాయి. ఎన్నికల సమయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో పాలనా పరంగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మిషన్ 400 సీట్ల లక్ష్యంతో పని చేస్తోంది. ఏపీలోనూ పాత మిత్రులను కలుపుకు వెళ్లాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది. భారతదేశాన్ని 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో నీతీ ఆయోగ్ విశాఖపట్నం, ముంబై, సూరత్, వారాణసీ నగరాలకు ఆర్థిక ప్రణాళికను రూపొందించింది. నీతీ ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ అంశం పైన అధికారికంగా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దోహదపడేలా ఆ నాలుగు నగరాల ఆర్థిక పరివర్తన కోసం నీతీ ఆయోగ్ ఒక ప్రణాళికను రూపొందించిందని చెప్పారు.

ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మరో 20-25 నగరాలకు కూడా ఆర్థిక ప్రణాళికను రూపొందించాలనుకొంటున్నామని తెలిపారు. అలాగే, 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే విజన్ డాక్యుమెంట్‌నూ నీతీ ఆయోగ్ రూపొందిస్తోందని, ఆ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేస్తారని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 11న యువత నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటి వరకు యువత నుంచి 10 లక్షలకుపైగా వివరణాత్మక సూచనలు వచ్చినట్లు తెలిపారు. కృత్రిమ మేధను ఉపయోగించి వాటన్నింటినీ ప్రాసెసింగ్ చేస్తున్నామని బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications