ఏపీలో గోల్డ్‌ మైనింగ్‌- రామగిరిలో తవ్వకాలకు ఎన్‌ఎండీసీ ప్లాన్ -రెండుదశాబ్దాల తర్వాత

దేశవ్యాప్తంగా బంగారం నిక్షేపాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఐదో స్ధానంలో ఏపీ ఉంది. బీహార్‌, రాజస్ధాన్‌, కర్నాటక, పశ్చిమబెంగాల్ తొలి నాలుగు స్ధానాల్లో ఉండగా.. ఏపీ ఐదో స్ధానంలో ఉంది. ఇక్కడి రాయలసీమ ప్రాంతంలో గతంలో బంగారం తవ్వకాలు భారీగా జరిగేవి. అదీ అనంతపురం జిల్లాలో వీటి తవ్వకాలు ఎక్కువగా ఉండేవి. కానీ అప్పట్లో బంగారం ధర కంటే వాటి తవ్వకాలకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ వీటి తవ్వకాలను నిలిపేసింది. తిరిగి రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఈ ప్రాంతంలో బంగారం తవ్వకాలకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

 ఏపీలో బంగారం తవ్వకాలు

ఏపీలో బంగారం తవ్వకాలు


ఏపీలో బంగారపు గనులకు రాయలసీమ పెట్టింది పేరు. వర్షం కురియగానే సీమ జిల్లాల్లో పొలాల్లో సైతం ఇక్కడి జనం బంగారం, ముత్యాలు, వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. కుటుంబాలకు కుటుంబాలు, ఊళ్లకు ఊళ్లు వీటి కోసం అన్వేషణ చేస్తుంటారు. ఏదో ఒక బంగారం, లేదా వజ్రపు ముక్క దొరికితే దాన్ని అమ్ముకుందామన్న ఆశ వారిది. గతంలో ఇక్కడ సాగిన బంగారం మైనింగే దీనికి కారణం. కానీ దశాబ్దాలుగా ఇక్కడ బంగారం తవ్వకాలు నిలిచిపోయాయి. తిరిగి చాలా కాలం తర్వాత జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ ఎన్‌ఎండీసీ తిరిగి ఇక్కడ బంగారం అన్వేషణకు సిద్ధమవుతోంది.

చిత్తూరు, అనంతపురంలో బంగారం అన్వేషణ

చిత్తూరు, అనంతపురంలో బంగారం అన్వేషణ

రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బంగారం అన్వేషణకు ఎన్‌ఎండీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చిగురుగుంటలో బంగారం తవ్వకాలకు అనుమతులు దక్కించుకున్న ఎన్‌ఎండీసీ, ఇప్పుడు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక్కడ ఓసారి తవ్వకాలు చేపడితే ఎంత మేరకు బంగారం దొరకవచ్చు, ఎంత ఖర్చవుతుంది, అది గిట్టుబాటు వ్యవహారమేనా కాదా అన్న అంశాలను అధ్యయనం చేసేందుకు ఎన్‌ఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. తవ్వకాలకు అనుమతి రాగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

గతంలో రామగిరిలో బంగారం మైనింగ్‌

గతంలో రామగిరిలో బంగారం మైనింగ్‌


అనంతపురం జిల్లా రామగిరిలో రెండు దశాబ్దాల క్రితం బంగారం మైనింగ్‌ జరిగింది. అప్పట్లో భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ సంస్ద ఇక్కడ తవ్వకాలు నిర్వహించింది. అయితే అప్పట్లో బంగారం ధరలు తక్కువగా ఉండేవి. బంగారం తవ్వి తీసేందుకు అయిన ఖర్చుతో పోలిస్తే దాన్ని అమ్మితే వచ్చే ఖర్చు బాగా తక్కువగా ఉండంటంతో గోల్డ్ మైనింగ్‌ను నిలిపేశారు. ఇప్పుడు పరిస్దితి మారింది. కొన్నేళ్లుగా దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు స్ధిరంగా పరుగుతున్నాయి. దీంతో గోల్డ్‌ మైనింగ్‌ నిర్వహించి ఖనిజాన్ని వెలికితీస్తే ఎగుమతులు చేసే అవకాశాలను ఎన్‌ఎండీసీ పరిశీలిస్తోంది.

టన్నుకు 3 గ్రాముల బంగారం ఉండొచ్చని అంచనా

టన్నుకు 3 గ్రాముల బంగారం ఉండొచ్చని అంచనా

రామగిరిలో బంగారపు గనుల తవ్వకాలను ప్రారంభిస్తే వందల అడుగుల లోతుకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ స్ధాయిలో తవ్వకాలు జరిగితే టన్నుకు 2 నుంచి 3 గ్రాముల బంగారం లభ్యమవుతుందని ఎన్‌ఎండీసీ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, మరి కొన్ని చోట్ల కొంత తక్కువగా కూడా ఉండొచ్చు. అయితే సగటున టన్ను మట్టి నుంచి 2 నుంచి 3 గ్రాముల బంగారం లభ్యం కావచ్చని తెలుస్తోంది. దీంతో ఈ మేరకు అయ్యే ఖర్చును ఎన్ఎండీసీ అంచనా వేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే అతి త్వరలో ఈ తవ్వకాలు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+