రఘురామ వర్సెస్ శ్రీ రంగనాథరాజు: తన ఫిర్యాదుపై నో యాక్షన్, మంత్రి పీఏ కంప్లైంట్‌పై మాత్రం వెంటనే..
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విరుచుకుపడ్డారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మంత్రి శ్రీ రంగనాథరాజు పీఎస్ ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించారని గుర్తుచేశారు. అదే తాను కంప్లైంట్ చేసి 20 రోజులవుతున్నా అతీ గతీ లేదన్నారు. రాష్ట్రంలో ఎందుకీ పక్షపాతమో అర్థం కావడం లేదన్నారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

20 రోజులవుతున్నా..
తన దిష్టిబొమ్మ దహనం చేశారని, సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేశానని రఘురామ చెప్పారు. 20 రోజులవుతున్నా వారిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదున్నారు. కానీ తనపై మాత్రం మంత్రి పీఎస్ కంప్లైంట్ చేసినా వెంటనే కేసు నమోదు చేశారని తెలిపారు. అంతేకాదు తనే మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశానని తప్పుడు కంప్లైంట్ చేశారని తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు కూడా మంత్రి అంటే ఒకలా.. తన ఫిర్యాదుపై మరొలా తీసుకున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ విషయం
రఘురామ మంత్రి రంగనాథరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోడూరు పోలీసు స్టేషన్‌లో మంత్రి పీఏ సురేశ్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు మంత్రి పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. ఎంపీ రఘురామపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సురేశ్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు అని తెలుస్తోంది. ప్రైవేట్ కేసు అయినందున కోర్టులో తేల్చుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వెంటనే రఘురామ కూడా స్పందించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే
రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఆయన ఎంపీ అయ్యారని.. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవీ వచ్చిందని పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీనికి రఘురామ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.
Recommended Video

మాటల యుద్ధం
మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వైసీపీ నేతలు కూడా రఘురామపై ముప్పేట మాటల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రంగనాథరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో మరోసారి చర్చకు దారితీసింది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications