అవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనం
అమరావతి:ఏపీకి దక్కాల్సిన నిధుల విషయమై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఒక్క రోజుతోనే ఈ అంశం ముగిసే అవకాశం ఉంటుందని బాబు అభిప్రాయపడ్డారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 19 అంశాలు, ఎన్నికల ప్రచారంలో మోడీ ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. టిడిఎల్పీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంపై అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపితో పొత్తును తెగదెంపులు చేసుకోవాలని మెజారిటీ టిడిపి ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు చంద్రబాబునాయుడు ఈ విషయమై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనం
కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిఎల్పీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.కొందరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంటున్నారని, తీర్మానం పెట్టడానికి 50 మంది సంతకాలు కావాలని అన్నారు. అవిశ్వాసం పెడితే ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.

ఒక్క రోజుతోనే చర్చ ముగుస్తోంది
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఒక్క రోజుతోనే చర్చ పూర్తయ్యే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం పెడితే ఒక్క రోజుతోనే చర్చ ముగిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రుల పదవుల్లో ఏముందని ప్రశ్నించారు. అవేమన్నా ప్రాధాన్యం ఉన్న పదవులా? అని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా విధానం
ప్రత్యేక హోదా విధానం నుండి తాము వైదొలిగిపోలేదని టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. వరుస విజయాలతో బిజెపి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

బిజెపిపై ప్రజలు అసంతృప్తి
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలనే విషయమై బిజెపి అనుసరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. టిడిఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బిజెపసి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications