రూ.64 లక్షలు: నిర్మించని కాంప్లెక్స్‌కు బిల్లు, పశ్చిమలో 500 కేసులు, వెల్లంపల్లిపై ఫైర్..
కరోనా కేసులు, మరణాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 1500 పాజిటివ్ కేసులు ఉంటే.. పశ్చిమలో 500 కేసులు ఉన్నాయని జనసేన నేత పోతిన మహేశ్ గుర్తుచేశారు. దీనిని బట్టి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థమవుతోందన్నారు. పాజిటివ్ కేసులే కాదు.. మరణాలు కూడా ఎక్కువేనని తెలిపారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పనితీరుకు ఇదీ నిదర్శనం అని సెటైర్ వేశారు. వాస్తవానికి మంత్రి విరాళాలు వస్తే బాగా పనిచేస్తారని.. ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోయారని మండిపడ్డారు.

తప్పుడు ఫలితాలు..?
కరోనా పరీక్షలకు సంబంధించి రిజల్ట్స్ తప్పుగా వస్తున్నాయని మహేశ్ పేర్కొన్నారు. బస్సుల ద్వారా చేస్తున్న స్వాబ్ టెస్ట్ సరిగా చేయడం లేదన్నారు. అంతేకాదు టెస్ట్ రిజల్ట్ సరిగా లేకపోవడం వల్లే ఎండోమెంట్ కాంట్రాక్టర్ చనిపోయారని గుర్తుచేశారు. ఈ విషయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా తెలుసు అని చెప్పారు. దుర్గగుడిలో అక్రమాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు.

రూ.64 లక్షలు
నిర్మించని కాంప్లెక్స్‌కు రూ.64 లక్షల బిల్లు మంజూరయ్యిందని మహేశ్ తెలిపారు. నిధులు విడుదల విషయం మంత్రి, ఆలయ చైర్మన్ సోమినాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. మంత్రికి తెలియకుండానే బిల్లు మంజూరయ్యిందా అని ప్రశ్నించారు. ఇందులో మంత్రికి వాటా ఉందని ఆరోపించారు. ఆలయంలోకి సురేశ్ ఈవోగా వచ్చాక.. ఆగడాలు పెరిగిపోయాయని చెప్పారు. అమ్మవారి ఆదాయాన్ని కూడా దోచేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ పర్యవేక్షణ
దుర్గ ఆలయంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని మహేశ్ అభిప్రాయపడ్డారు. హిందూ ఆలయాలపై సీఎం జగన్ చొరవ చూపాలని కోరారు. లేదంటే ఆలయాల పట్ల ఆయనకు ఇంట్రెస్ట్ లేదు అని తేలిపోతుందని పేర్కొన్నారు. అలాగే ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్నాక స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయాలు.. ముఖ్యంగా కోర్టుల గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications