అయినా మనిషి మారలేదు: చంద్రబాబు బొత్స వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నూతన సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదని, అబద్ధాలే చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకోసం రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.50వేల కోట్లు ఖర్చు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

No Change in Chandrababu in year also

చంద్రబాబు ఏ దేశం వెళితే అక్కడి రాజధానిలాగా అమరావతి రాజధానిని నిర్మిస్తానని అంటున్నారని బొత్స వ్యంగ్యంగా అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500కోట్లు ఇస్తే రూ.1583కోట్లతో నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అంటూ అసలు పర్మినెంట్‌ రాజ్‌భవన్‌, సచివాలయం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

ఇంకా ఎన్నాళ్లు చంద్రబాబు ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే హౌస్ అరెస్టులు చేస్తున్నారని, గుంటూరులో తమ పార్టీ నేత అంబటి రాంబాబును హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని అన్నారు.

అంబటి సత్తెనపల్లి వెళితే వాస్తవాలు వెల్లడవుతాయని ప్రభుత్వానికి వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు. నిజంగానే అందిరికీ అక్కడ పెన్షన్లు ఇస్తే ఎందుకంత భయపడాలని అడిగారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party leader Botsa Satyanarayana criticised Andhra Pradesh CM Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి