వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మారలేదు: మోత్కుపల్లి, ఆర్డినెన్స్‌పై నేతల ఫైర్

|
Google Oneindia TeluguNews

No Changes in KCR: Motkupally
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావులో ఎలాంటి మార్పులేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు కూడా బంద్‌లు ప్రకటించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కెసిఆర్‌పై మండిపడ్డారు.

పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ చేసిన ఆర్డినెన్స్ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆ ఆర్డినెన్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని కెసిఆర్‌కు ఆయన సూచించారు.

ఇది ఇలా ఉండగా పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కుట్రపూరితంగా వ్యవహరించి ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారని ఆరోపించారు. మరో ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని తెలంగాణ ఐటి ఉద్యోగులు కూడా వ్యతిరేకించారు.

పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ చేసిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉండేట్లు చూడాలని అన్నారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం వెనుక ఎదో కుట్ర దాగివుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

English summary
Telugudesam Party senior leader Motkupally Narsimhulu on Thursday fired at Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X