వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శవం పక్కన సంతకాలు పెట్టించిన జగన్‌తో పోలికనా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

 No comparison between YS Jagan and Rahul: VH
నిజామాబాద్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పోలికా? అని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శనివారం అన్నారు. తండ్రి చనిపోయినప్పుడు ఎవరైనా పుట్టెడు దుఃఖంలో ఉంటారని, జగన్ మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం శవం పక్కనే కూర్చొని సంతకాల సేకరణ చేపట్టారని, అదే రాహుల్ కేంద్రమంత్రి పదవి ఇస్తామన్నా తీసుకోలేదన్నారు.

తెలంగాణకు తాము అనుకూలమని చెప్పిన జగన్, తర్వాత మాట మార్చాడన్నారు. రక్తపాతం సృష్టించి తెలంగాణ ఆపాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తెలంగాణలో పుట్టానని, హైదరాబాదులోనే చదివానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు పుట్టిన గడ్డను ఎవరు మరువవద్దని, అన్యాయం చేయవద్దని హితవి పలికారు. సోనియా నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తి కిరణ్‌కు ఉందా అన్నారు.

తెలంగాణ ప్రకటన తర్వాత లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్ాలని చంద్రబాబు అడిగారని, బాబులో మంచి మార్పు వచ్చిందనుకున్నానని, నాలుగు రోజుల తర్వాత కిరణ్ వేసిన స్కెచ్‌తో చంద్రబాబులో మార్పు వచ్చిందన్నారు. హెలికాప్టర్ పేలుస్తానని పొన్నం ప్రభాకర్ ఊరికే అంటే కేసు పెట్టారని, అశోక్ బాబు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటానంటే మాత్రం పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మోడీకి ప్రధాని అయ్యే అర్హత లేదన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి, తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సోనియాకి తెలంగాణ ప్రజలు కృతజ్ఞులుగా ఉండాలన్నారు. చంద్రబాబు, జగన్, కిరణ్‌లు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన తర్వాతనే సిబ్ల్యూసిలో కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. ఇప్పుడు అడ్డుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని 119 శాసన సభ, 17ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపిస్తే సోనియాకు నిజమైన కృతజ్ఞత చెప్పిన వారమవుతామన్నారు.

సోనియాకు కృతజ్ఞతగా రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు కృషి చేద్దామని విహెచ్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న నిర్వహించే ఏఐసిసి సమావేశంలో రాహుల్‌ని ప్రధానిగా ప్రకటించాలని తెలంగాణలో కోటి సంతకాలు సేకరించి సోనియాకు పంపుతామన్నారు. ఇందిరమ్మ రథయాత్రలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా భిక్కనూరు, కామారెడ్డిలలో నిర్వహించిన సభల్లో విహెచ్ మాట్లాడారు.

English summary
Congress Party senior leader V Hanumantha Rao said there is no comparision between YSR Congress Party chief YS Jaganmohan Reddy and Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X