పార్టీలకు టైం కేటాయింపు, టీడీపీకి 13 ని.లు: ఏపీ నేతలకు షాకిచ్చిన పన్నీరుసెల్వం

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం పార్టీలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సమయం కేటాయించారు. బీజేపీకి గం.3.33 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి 38 నిమిషాలు, అన్నాడీఎంకేకు 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకి 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, టీడీపీకి 13 నిమిషాలు, టీఆర్ఎస్‌కు 9 నిమిషాలు, సీపీఐకి 7 నిమిషాలు, ఎస్పీకి 6 నిమిషాలు, ఎల్జీఎస్పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు.

చంద్రబాబుకు పళనిస్వామి కౌంటర్

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిచ్చేది లేదని తమిళనాడు సీఎం పళనిస్వామి అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని ఆ రాష్ట్రం పోరాడుతోందని, అందుకనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది, ఇంతకు ముందు పార్లమెంట్‌ సమావేశాల్లో కావేరీ వివాదం విషయంలో తమిళనాడుకు చెందిన తమ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టినప్పుడు తమకు మద్దతు ఇవ్వడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు.

No Confidence Motion: BJP gets 3.5 hours to speak tomorrow, Congress gets 38 minutes

మా రైతుల కష్టాలు తీర్చాలని మేం పోరాడుతుంటే మాకెవరు అండగా నిలిచారని ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రమైనా ముందుకు వచ్చిందా అన్నారు. ఇప్పుడు ఏపీకి అన్యాయం జరిగిందని తమ మద్దతు కోరుతున్నారని, మాకు వాళ్లు సాయపడ్డారా అని నిలదీశారు.

టీడీపీకి చెందిన కొందరు నేతలు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంను కలవడానికి అనుమతి కోరగా.. ఆయన వారితో భేటీకి నిరాకరించారు. పళనిస్వామి కనీసం తాము మద్దతు ఇచ్చేది లేదని చెప్పారు. పన్నీరుసెల్వం అయితే టీడీపీ నేతలను కలిసేందుకే నో చెప్పి షాకిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+