జగన్‌లాంటి వాళ్లు ఉంటే ఇంతే, వైసిపిలో విశ్వాసముందా: కాల్వ

విజయవాడ: వైయస్ జగన్ వంటి ప్రతిపక్ష నేత ఉంటే శాసన సభ సమావేశాలు ఇలాగే జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శుక్రవారం నాడు అన్నారు. గత సభలలో ఎప్పుడు కూడా అర్థవంతమైన చర్చలు జరగలేదన్నారు. అందుకు ప్రతిపక్షమే కారణమని మండిపడ్డారు.

ప్రభుత్వం పైన అవిశ్వాసం ఓ కుట్రపూరితమన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని జగన్ అవహేళన చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా సహాయపడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

అవగాహన, చట్టం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉంటే గత అసెంబ్లీ సమావేశాల్లాగే.. సభలో అర్థవంతమైన చర్చ జరగదన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్న జగన్‌కు అసలు తన పార్టీలో ఆయన పట్ల విశ్వాసం ఉందో లేదో నిరూపించుకోవాలన్నారు.

No confidence motion is YS Jagan's conspiracy: Kalva

ఇటీవల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరికొంతమంది నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జగన్‌కు తమ పార్టీలో విశ్వాసం ఉందో చూసుకోవాలని సవాల్ చేయడం గమనార్హం.

ఉద్యమాల పేరుతో రైళ్లు తగలబెడితే చెడ్డపేరే తప్ప మంచి కాదు

ఉద్యమాల పేరుతో రైళ్లు తగలబెడితే కులాలకు చెడ్డపేరే తప్ప మంచి పేరు రాదని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముద్రగడ పద్మనాభం అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. అలాగే ఆవేశపూరిత దీక్షలకు ప్రజల మద్దతు ఉండదన్నారు. మీ ఉద్యమాల వల్ల వేరే పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉంటే అలాంటి ఉద్యమాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+