నో డౌట్, తమిళ పీఠం కరుణానిధిదే : లగడపాటి
రాజకీయ సన్యాసం చేసినా.. రాజకీయాలపై తనదైన అభిప్రాయాన్ని వినిపిస్తూనే ఉన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే విషయంలో ఆయనకో బ్రాండ్ గా ముద్ర కూడా పడిపోయింది. దానికి తగ్గట్టే.. ఆయన చెప్పే ఫలితాలు కూడా ఎప్పుడూ బెడిసి కొట్టలేదు. దీంతో ఏ ఎన్నిక జరిగినా, లగడపాటి నోటి నుంచి ఎవరి పేరు వినిపిస్తుందా..! అని ఎదురుచూసే వాళ్లు లేకపోలేదు.

తాజా తమిళనాడు ఎన్నికలపై స్పందించిన లగడపాటి.. ఈ దఫా తమిళ పీఠం కరుణానిధిదే అని తేల్చేశారు. దీనికి కారణం కూడా చెప్పిన ఆయన, రుణమాఫీ హామినే కరుణానిధి విజయానికి ప్రధాన కారణమన్నారు. మిగతా పార్టీలు కూడా రుణమాఫీ హామిలిచ్చినా, తమిళ ప్రజలు మాత్రం అందరికంటే ముందు ఈ హామిని మ్యానిఫెస్టోలో పెట్టిన కరుణానిధికే పట్టం కట్టారని తెలిపారు.
అయితే.. తమిళ ఎన్నికల ఫలితాలు వెల్లడేతే గానీ ఎవరి మాటల్లో ఎంత నిజముందనేది తెలుస్తుంది. మరి లగడపాటి వాక్కు ఈసారి కూడా నిజమవుతుందా..! లేక ఆ పరంపరకు తాజా ఫలితాలు దానికి బ్రేక్ వేస్తాయా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications