వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 10 వరకు కర్ఫ్యూ యథాతధం.!విజయవాడలో 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కరోన రెండవ దశ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో జూన్ 10 వ తేదీ వరకు కర్ఫ్యూ విధించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ సోమవారం ఒక ప్రకటన లో వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం తాత్కాలిక సడలింపు ఇస్తున్నామని తెలిపారు. పరిమితులతో కూడిన సడలింపులను నిత్యావసరాల కోసం మాత్రమే ఇచ్చామని కలెక్టర్ స్పష్టం చేసారు. అంతే కాకుండా కర్ఫ్యూ సమయం యధాతధంగా అమలులో ఉంటుందని, అనవసరంగా కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఒక చోట 5 గురు, అంతకుమించి గుమికూడితే చట్టరీత్యా నేరమవుతుందని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసారు.

no help a father holds dead baA curfew has been imposed in Krishna district till June 10 due to the second phase of Coronaby and crying at up hospital

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 10 వ తేదీ వరకు జిల్లా లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పరిమితులకు లోబడి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్ లో ఉండి కొనుగోలు కు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో కూడా 5 గురు, లేక అంతకు మించి ఒక్క చోట గుమికూడరాదని కలెక్టర్ హెచ్చరించారు. కరోన వ్యాప్తి నేపధ్యంలో కర్ఫ్యూ సమయంలో, 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అత్యవస పనులపై బయటకు వొస్తే తగిన ఆధారాలతో రావాలని, అనవసరంగా బయటకు వొచ్చి ఇబ్బందులు పడవొద్దన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకారాన్ని అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బయటకు వొచ్చినా విధిగా రెండు మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

English summary
A curfew has been imposed in Krishna district till June 10 due to the second phase of CoronaDistrict Collector MD Intiaz revealed in a statement on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X