తెలుగు మహాసభలకు ఆహ్వానం లేకపోవడంపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: ప్రపంచం తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవిదేశాల నుంచి విచ్చేసిన 8వేల మందికిపైగా ప్రతినిధులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నఈ తెలుగు మహా సభలకు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు. కానీ పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మాత్రం ఆహ్వానం అందలేదు.
ప్రపంచ తెలుగు మహాసభలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. తనకు ఆహ్వానం రాకపోయినా మరేం ఫరవాలేదన్నారు. తెలుగు భాషను అందరూ గౌరవించాలని అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు జరిగే ఏ కార్యక్రమానికైనా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.













Click it and Unblock the Notifications