ఇక బీసీలకు ఉద్యోగాలు రానట్టే, పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిందే: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుని, బీసీల అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. బీసీ జాతికి విలువ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ చాలా మంది బీసీలకు ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు. ఒకవేళ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే నిజమైన బీసీలకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బీసీ నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని, పెద్ద ఎత్తున నాయకులు ఉద్యమించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications