షాక్: మంత్రి పదవుల్లో మాదిగలకు అసంతృప్తి: ఎమ్మెల్సీ డొక్కా
ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవుల నియామకంపై మాదిగ కులస్థుల్లో అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవుల నియామకంపై మాదిగ కులస్థుల్లో అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు.
శుక్రవారంనాడు ఆయనతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు టిడిపి కట్టుబడి ఉందన్నారు.అన్ని కులాలను కలుపుకుపోవాలని మందకృష్ణ కోరారు.

ఎస్సీ వర్గీకరణపై మహానాడులో తీర్మాణం చేసేందుకు కృషి చేస్తానని డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మాలలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని మాదిగల్లో అసంతృప్తి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయాలన్నింటిని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు మాణిక్యవరప్రసాద్ చెప్పారు.












Click it and Unblock the Notifications