• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్ డౌన్ ఆంక్షలను కాదని గ్రామ వాలంటీర్ల మందు పార్టీ..! జగనన్నా...? ఏందన్నా ఇది...?

|

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశం మొత్తం స్వీయ నియంత్రణ పాటిస్తోంది. కష్టంతో కూడుకున్నదైనప్పటికి ప్రజలందరూ లాక్ డౌన్ ఆంక్షలను పాటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను పాటిస్తూ కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు తమవంతు యుద్దం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాద్యతాయుత విధులు నిర్వహించే కొంతమంది గ్రామ వాలంటీర్లు తమ కర్తవ్యాన్ని, లాక్ డౌన్ ఆంక్షలను మరిచి మస్తుగా మందు పార్టీ చేసుకున్నారు. విశాఖలో జరిగిన ఈ ఉదంతంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 లాక్ డౌన్ ఆంక్షలే భేఖాతరు.. ఏపిలో మస్తుగా మందుపార్టీ చేసుకున్న గ్రామవాలంటీర్లు..

లాక్ డౌన్ ఆంక్షలే భేఖాతరు.. ఏపిలో మస్తుగా మందుపార్టీ చేసుకున్న గ్రామవాలంటీర్లు..

గ్రామ వాలంటీర్లు.. వైసీపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం గాని, ప్రభుత్వ రాయితీల గురించి గాని, కొత్త పథకాల వివరాల గురించి గాని ప్రజలకు సత్వరం చేర వేసి, అందుకు తగ్గ లబ్ది దారులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను నిరుపేద ప్రజలకు చేరవేయడమే ఈ వాలంటీర్ల కర్తవ్యం.

 ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధులగా గ్రామ వాలంటీర్లు.. మామిడి తోటలో మజా చేసుకున్న వాలంటీర్లు..

ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధులగా గ్రామ వాలంటీర్లు.. మామిడి తోటలో మజా చేసుకున్న వాలంటీర్లు..

అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్తి దారులను గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కూడా ఈ వాలంటీర్ల విధుల్లో ప్రధాన భాగం. అంటే ప్రభుత్వ ప్రతిష్టతకు సంబందించిన అంశాలు చాలా వరకు ఈ గ్రామ వాలంటీర్లతో ముడిపడి ఉందని తెలుస్తోంది. ఇంతటి బాద్యతాయుత హోదాలో ఉన్న కొంతమంది చేసిన పనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకునే పరిస్థితులు తలెత్తాయి. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్న తరుణంలో ఏపిలోని గ్రామవాలంటీర్లు ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చే పని చేసినట్టు తెలుస్తోంది.

 నలుగురికి చెప్పాల్సిన వాళ్లు.. తప్పు చేసారంటున్న విశాఖ వాసులు..

నలుగురికి చెప్పాల్సిన వాళ్లు.. తప్పు చేసారంటున్న విశాఖ వాసులు..

కరోనా కష్టకాలంలో ఆంధ్ర ప్రదేశ్ లోని కొంతమంది గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ అనుమానితులను గుర్తించడంతో పాటు, గ్రామాల్లోని ప్రజల్లో వైరస్‌పై అవగాహన కల్పించడంతో సహా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ వాలంటీర్ల పని తీరుపట్ల ప్రశంసలు అందుతున్న తరుణంలో ఒక్క సారిగి విమర్శల పాలయ్యారు. కొంతమంది గ్రామ వాలంటీర్లు లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక పంచాయతీకి చెందిన 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

  Fake News Buster 12 : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీ చేసి మోసపోకండి..!!
   లాక్ డౌన్ ఆంక్షల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి... అందుకు విరుద్దంగా వ్యవహరించిన గ్రామ వాలంటీర్లు..

  లాక్ డౌన్ ఆంక్షల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి... అందుకు విరుద్దంగా వ్యవహరించిన గ్రామ వాలంటీర్లు..

  ఏటికొప్పాక పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ తోటాడ కుమార్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తోటి వాలంటీర్లకు స్థానిక మామిడి తోటలో మద్యంతో కూడుకున్న విందు ఏర్పాటు చేశాడు. దీనికి సహచర గ్రామ వాలంటీర్లు హాజరయ్యారు. పార్టీకి హాజరైన వారందరూ లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఢించినట్టు తెలుస్తోంది. అందులో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. అంతేకాక సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా కూర్చుని విందు ఆరగించారు. అనంతరం వారందరూ కాసేపు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రూరల్ ఎస్ఐ వీరిపై కేసు నమోదు చేశారు. ఇదే

  అంశం ఇప్పుడు వైసీపి ప్రభుత్వానికి సంకటంగా మారినట్టు తెలుస్తోంది.

  English summary
  T.Kumar, a village volunteer from Etikoppakka Panchayat, hosted an alcohol party at a local mango garden on Tuesday for his son's birthday. It was attended by fellow village volunteers. All those attending the party seem to have violated the lockdown restrictions
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X