దొనకొండ ఎఫెక్ట్: 'అమరావతిని జగన్ అడ్డుకోవడానికి కారణం ఇదీ'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వందమంది జగన్‌లు వచ్చినా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు బుధవారం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్న తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతాయన్నారు.

కాంగ్రెస్ టార్గెట్ జగన్, సోనియా-రాహుల్‌లతో క్షమాపణ చెప్పించాలని..

జగన్ కలలు నెరవేరకపోవడంతో అమరావతికి అడ్డు

జగన్ కలలు నెరవేరకపోవడంతో అమరావతికి అడ్డు

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆనందబాబు అన్నారు. దొనకొండలో రాజధాని రావాలని కలలు కన్న జగన్, తన ఆశలు నెరవేరకపోవడంతో అమరావతి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్‌కు భారతరత్నపై గాలి

ఎన్టీఆర్‌కు భారతరత్నపై గాలి

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్‌ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రూ.100, రూ.5 నాణేలు విడుదల చేయనుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను నిలువరించిన ఎన్టీఆర్ మాటేమిటి

కాంగ్రెస్‌ను నిలువరించిన ఎన్టీఆర్ మాటేమిటి

ఎంజీఆర్‌ డీఎంకే పార్టీలో కొంతకాలం పనిచేసి కొత్త పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేశారని గాలి ముద్దుకృష్ణమ గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని నిలువరించి ప్రజల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారన్నారు.

కెసిఆర్, చంద్రబాబు వెంటనే స్పందించాలి

కెసిఆర్, చంద్రబాబు వెంటనే స్పందించాలి

అంతటి గొప్ప మహా నేతకు భారతరత్న ఇవ్వాలని, ఢిల్లీలోని ప్రధాన మార్గానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ముఖ్య మంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ స్పందించి భారతరత్న ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and Minister Nakka Anand Babu on Wednesday said that no one can stop Andhra Pradesh capital building of Amaravati. He lashed out at YSRCP chief YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X