Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిఠాపురంలో లక్ష మెజారిటీ.. పవన్ కళ్యాణ్ గెలుపునెవరూ ఆపలేరు.. జగన్‌ను మించి టాప్ మెజారిటీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో పిఠాపురంపైన చర్చ ఆసక్తికరంగా మారింది. ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా? లేదా అన్న చర్చ ఏపీలో జోరుగా కొనసాగుతుంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని సాధిస్తారని పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

పొత్తుతో పోటీ చేసిన జనసేన
2009లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోరపరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు.

No one can stop Pawan Kalyan victory in pithapuram janasena chief with Top majority than ys Jagan

పవన్ కళ్యాణ్ మెజారిటీపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కూటమితో ఎన్నికల బరిలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈసారి చాలా బలంగానే వైసిపితో యుద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ ప్రముఖులు పిఠాపురం వెళ్లి మరీ ప్రచారం చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా? ఆయనకు ఎంత మెజారిటీ వస్తుంది? అన్నదానిపైన పిఠాపురం కూటమి ఇన్చార్జ్ ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇలా
ఒక టీవీ డిబేట్లో పాల్గొన్న ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఓట్లు పడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిఠాపురంలో రెండు లక్షల నాలుగు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయని, పవన్ కళ్యాణ్ కు ఒక లక్ష 50 వేల ఓట్లు వస్తాయని, మొత్తంగా ఆయన లక్ష మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తారని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్ కంటే పవన్ కే ఎక్కువ మెజార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సంపాదించే నాయకులలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని పేర్కొన్న వర్మ రాష్ట్రంలో టాప్ మెజారిటీ వచ్చేది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు మాత్రమేనని చెప్పారు. ఈసారి పవన్ కళ్యాణ్ కు వైఎస్ జగన్ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి టాప్ మెజారిటీతో గెలుస్తారు
2019 ఎన్నికలలో తనకు వైఎస్ జగన్ తో సమానంగా మెజారిటీ వచ్చిందని చెప్పిన వర్మ ఈసారి పిఠాపురంలో ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేశారన్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తని, ఎంతో నిజాయితీపరుడని, తాను ఆయన ఆలోచనలకు ఆకర్షితుడినయ్యానని వర్మ తెలిపారు. అందుకే ఆయనను గెలిపించే బాధ్యతను తీసుకుని అందరం కలిసికట్టుగా పని చేశామన్నారు. మొత్తంగా వర్మ మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి టాప్ మెజారిటీతో గెలవబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+