హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్షకు అనుమతి లేదు: డిసిపి స్పష్టీకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ఆమరణ దీక్షకు అనుమతి లేదని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేకుండా దీక్ష చేయడం నేరమని ఆయన అన్నారు.

దీక్షకు దిగితే అరెస్టుకు కూడా వెనుకాడబోమని పోలీసులు చెప్పారు. లోస్‌పాండ్ వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జగన్ దీక్షకు అడ్డుకుంటామని తెలంగాణ న్యాయవాదులు హెచ్చరించారు.

YS Jagan

సమైక్యాంధ్ర నినాదంతో వైయస్ జగన్ శనివారం ఉదయం పదిన్నర గంటలకు దీక్షకు దిగాల్సి ఉంది. ఆయన దీక్షకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, 1 1గంటలు దాటినప్పటికీ ఆయన దీక్ష ప్రారంభం కాలేదు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జగన్ శుక్రవారంనాడు ప్రకటించారు. రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని ఆయన అంటున్నారు.

English summary
Hyderabad west zone DCP Satyanarayana said that YSR Congress party president YS Jagan fast will not be allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X