ఎందుకు ఓడించామా అని ఓట్లరు బాధపడాలి, కోడి పందెలను జూదంగా మార్చొద్దు: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
  సంక్రాంతికి ముందు వచ్చే పండుగ జన్మభూమి

  అమరావతి: విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఛార్జీలను పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రం ఏపీ రాష్ట్రమేనని ఆయన గుర్తు చేశారు.. వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం. ఎక్కడైనా ఒకటిరెండు చోట్ల ఓడిపోతే... ఎందుకు ఓడించామా అని అక్కడి ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుంది. నా కష్టానికి కూలీ ఇవ్వాలా? వద్దా? నేనడిగేది కూలీ మాత్రమేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

  రాష్ట్రంలో మంగళవారం నుండి జన్మభూమి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మభూమి సందర్భంగా చేపట్టనున్న అంశాల గురించి ప్రస్తావించారు.

  పుట్టిన గ్రామాల అభివృద్ది కోసం ఏం చేయాలో పది రోజుల పాటు ఆలోచించాలని చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. సంక్రాంతికి ముందు వచ్చే పండుగ జన్మభూమి అని చంద్రబాబునాయుడు చెప్పారు.

  విద్యుత్ ఛార్జీలు పెంచం

  విద్యుత్ ఛార్జీలు పెంచం

  విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తేల్చి చెప్పిన ప్రభుత్వం కూడ ఏపీ ప్రభుత్వమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణలపై అపోహల కారణంగా 20014 ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయినట్టు బాబు గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం సోలార్ పాలసీని తెస్తే విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

  కోడిపెందెలను జూదంగా మార్చకూడదు

  కోడిపెందెలను జూదంగా మార్చకూడదు

  కోడి పందెలను జూదంగా మార్చకూడదని చంద్రబాబునాయుడు సూచించారు.సంక్రాంతికి కోడిపందేలు ఆడవద్దనడం లేదు. కానీ... వాటికి కత్తులు కట్టొద్దు. జూదంగా మార్చవద్దు. గ్రామీణ క్రీడల సంస్కృతిని గౌరవిస్తూనే... ప్రకృతిని కాపాడాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

  జన్మభూమిలో సమస్యలను ఆన్‌లైన్ లో పరిష్కారం

  జన్మభూమిలో సమస్యలను ఆన్‌లైన్ లో పరిష్కారం

  జన్మభూమిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఆన్‌లైన్ లో పెట్టనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. రియల్ టైమ్ లో సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆ సమస్య పరిష్కారం కాకపోతే కారణాలను కూడ వివరించనున్నట్టు చెప్పారు.కానీ, కార్యాలయాల చుట్టూ తిప్పుకోబోమని చంద్రబాబునాయుడు చెప్పారు.

  ఉగాదికి కొత్త కార్డులు

  ఉగాదికి కొత్త కార్డులు

  ఉగాదికి కొత్త కార్డులను అందించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పథకాల పంపిణీలో వాస్తవ సమాచారం కోసం సాధికార సర్వేను ప్రమాణికంగా తీసుకుంటున్నామన్నారు. మరో సారి సూక్ష్మస్థాయి సర్వే చేయిస్తామని చెప్పారు. జన్మభూమిలో 4లక్షల ఫించనుదార్లను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. వీరందరికీ ఉగాది నుంచి పింఛన్లు ఇస్తామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ap chief minister Chandrababu Naidu said that there is no electricity fare hike. He was spoke to media on Monday at Amaravati.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి