తీర్మానం లేకుండానే.. పదేళ్లు ఉమ్మడి: నోట్లో ఏముంది..!

ఈ నేపథ్యంలో కేబినెట్ ముందుకు రాబోయే నోట్‌లు పలు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనలతో నోట్ తయారు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ నోట్‌లో ఉండనుంది. అదే సమయంలో హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధాని అంశం కూడా జొప్పించారని తెలుస్తోంది.
ఈ పదేళ్లలో సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేకుండా ముందుకు వెళ్లాలని చూస్తోందని తెలిస్తోంది.
సిడబ్ల్యూసి నిర్ణయానికి అనుగుణంగానే నోట్ తయారయిందని తెలుస్తోంది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉంటారు. శాసన సభ స్థానాల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీలకు, పార్లమెంటు స్థానాల్లో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
సీమాంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే 175 మంది శాసన సభ స్థానాలు, 25 లోకసభ స్థానాలుంటాయి. శాసన సభ నియోజకవర్గాలలో 29 ఎస్సీ, 7 ఎస్టీ, లోకసభకు 4 ఎస్సీ, 1 ఎస్టీ స్థానాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications