Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్కీమ్ లు లేవు-స్కాములే- చంద్రబాబు పాలనపై జగన్ నిప్పులు-రైతు భరోసా నిధుల విడుదల

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో విడత నిధుల్ని సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలంటే తనతో పాటు ఓ గజదొంగల ముఠా కోసమేనని జగన్ తెలిపారు. ఎల్లో మీడియాకు తోడు దత్తపుత్రుడితో కలిపి గజ దొంగల ముఠాకు అధికారం కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమేనన్నారు. వారి హయాంలో చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క మంచి పథకం గుర్తుకొస్తుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజలు, పేదలు, విద్యార్దుల కంటే కూడా స్కాముల గురించే ఆలోచనలు జరిగాయన్నారు. స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక, రాజధాని భూములు వంటి స్కాములు చోటుచేసుకున్నాయన్నారు.

గత నాలుగున్నరేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తాము ఇచ్చిన పదవులు, గౌరవాల్ని, తాజాగా సామాజిక సాధికారిక యాత్రల్లో వారిని జనంలోకి ఎలా పంపుతున్నారో జగన్ వివరించారు. అదే సమయంలో రైతుల విషయంలో చంద్రబాబు పాలనకూ, తన పాలనకూ తేడా తెలుసుకోవాలని కోరారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో రైతులకు తమ ప్రభుత్వం చేసిన సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందో నిలదీయాలని సీఎం జగన్ సూచించారు. రైతులకు 70 శాతంగా ఉన్న రైతన్నలకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా రూ.13500 ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారని గతంలో ఎప్పుడూ ఎవరూ ఆలోచన చేయలేదన్నారు. అందుకే ఏటా 53 లక్షల పైచిలుకు రైతులకు, కౌలు రైతులకు, గిరిజన రైతులకు ఏటా రూ.13500 చొప్పున ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. గతంలో చంద్రబాబుకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదన్నదీ ఆలోచన చేయాలన్నారు.

no schemes, only scams in chandrababu regime- ys jagan slams, released ysr raithu bharosa funds

విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ గతంలో ఎప్పుడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఆ పని చేస్తున్నాయన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పనులు చేయలేకపోయారో రైతులు ఆలోచించాలన్నారు. పగటి పూట 9 గంటలకు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా తమదేనని జగన్ తెలిపారు. గతంలో పగలు, రాత్రీ కలిపినా ఏడు గంటలు కూడా వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదన్నారు. వ్యవసాయ ఫీడర్ల సామర్ధ్యం ఎందుకు పెంచలేదో ఆలోచించాలన్నారు.

చంద్రబాబు హయాంలో ఐదేళ్ల పాటు కరువుంటే, తన ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు పుష్కలంగా వర్షాలు పడ్డాయని జగన్ గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు బీమా సొమ్ము కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తమ ప్రభుత్వంలో ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చిందన్నారు. కరవు రావడం తమ చేతుల్లో లేకపోయినా వచ్చినప్పుడు రైతుల్ని ఆదుకోవడం మన చేతుల్లోనే ఉంటుందన్నారు. రైతులకు పూర్తిస్ధాయిలో పంటనష్టం ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.

no schemes, only scams in chandrababu regime- ys jagan slams, released ysr raithu bharosa funds

అదే రాష్ట్రం, అదే బడ్జెట్ ఉందని, కేవలం మారింది ముఖ్యమంత్రేనని జగన్ గుర్తుచేశారు. అప్పుల రేటు కూడా గతంలో కంటే తగ్గిందన్నారు. బటన్ నొక్కగానే నేరుగా 2లక్షల 40 వేల కోట్లు అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. కానీ చంద్రబాబు హయాంలో ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచించాలన్నారు. తాను చెప్పేవని నిజాలన్నారు. తాను ఎల్లో మీడియాను నమ్ముకోలేదని, దేవుడిని మాత్రమే నమ్ముకున్నట్లు తెలిపారు. అబద్ధాల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు సైన్యం వచ్చి మోసం చేసే మాటలు చెబుతుందన్నారు. ఇంటికి కేజీ బంగారం ఇస్తాం, బెంజికారు ఇస్తామంటారన్నారు. వాటిని నమ్మొద్దన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+