కొత్త జిల్లాలా..ఆ ఆలోచనే లేదు... న్యూ రెవిన్యూ డివిజన్లకు ఓకే...మంత్రి కెఈ స్పష్టీకరణ
రాష్ట్రంలో లో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని ఎపి రెవిన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సాగుతున్న ప్రచారానికి ఎపి రెవిన్యూ మంత్రి తెర దించారు. అసలు కొత్త జిల్లాల ఆలోచనే లేదని, ఆలోచనే లేనప్పడు ప్రతిపాదనలు ఎందుకు ఉంటాయని డిప్యూటీ సిఎం,రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి తేల్చి చెప్పేశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు మాత్రం చురుగ్గా కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో అక్కడ పది అక్కడ జిల్లాలు ఉండగా ఆ తరువాత వాటిని ఏకంగా 31కి పెంచారు. అదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం మొదట్లో భావించింది.

అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల లభ్యత, ఇతర సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచన పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉన్న 13 జిల్లాలతోనే పరిపాలన కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త జిల్లా, కొత్త మండలం, కొత్త డివిజన్‌ను ఏర్పాటుచేయాలంటే 1974లో తయారుచేసిన ఎపి డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చట్టంలోని సెక్షన్-3 ప్రకారం నడుచుకోవాలి. రాష్ట్ర విభజన జరిగిన కొత్తల్లో నూతన జిల్లాల ఏర్పాటుపై సీరియస్ గా చర్చ జరిగినా, ఆ తరువాత ఈ అంశాన్ని పక్కనపడేశారు.

కారణం కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. జిల్లాల్లో అన్ని శాఖలను ఏర్పాటుచేయాల్సి ఉండటం, ఆ శాఖలకు భవనాల లభ్యత, అధికారులు, ఉద్యోగులను కూడా నియామకం ఇవన్నీ ఆర్థిక భారం పెంచేవే. అలాగే నూతనంగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర కీలక స్థాయిలో ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ఈ దశలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్నే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి సోమవారం మీడియాకు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఆయన నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కనీసం ప్రతిపాదనలు కూడా లేవని తేల్చిచెప్పేశారు.

అయితే నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మాత్రం ప్రతిపాదనలు ఉన్నాయని, కొత్తగా 16 డివిజన్లు ఏర్పాటు కోసం అధికారులు నివేదిక సిద్ధం చేశారని మంత్రి కెఈ కృష్ణమూర్తి వివరించారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగిందని, వీటిపై తుది నిర్ణయం ఆయనే తీసుకోవాల్సి ఉంటుందని కెఈ తెలిపారు. వాస్తవానికి అనేక జిల్లాల్లో కొత్త రివిజన్ల అవసరం ఉన్నట్లు మంత్రి చెప్పారు. చిత్తూరు జిల్లానే తీసుకుంటే ఈ జిల్లాలో 66 మండలాలు ఉండగా, కేవలం మూడు డివిజన్లే ఉన్నాయన్నారు.
దీనివల్ల అనేక ఇబ్బందులున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 38 మండలాలే ఉన్నప్పటికీ మూడు డివిజన్లు ఉన్నాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ముందుగా రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications