ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: హైద్రాబాద్‌పై దానం

హైదరాబాదును తాము ఎట్టి పరిస్థితుల్లోను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదులో ఉన్న తమను సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం సరికాదన్నారు. సిడబ్ల్యూసి తీర్మానం యథాతథంగా అమలు చేయాలన్నారు. కీలక శాఖలు కేంద్రం పరిధిలోకి తెస్తే ఒప్పుకునేది లేదన్నారు. హైదరాబాదు తాత్కాలిక ఉమ్మడి రాజధాని అయినా ఫరవాలేదన్నారు.
రఘువీరాకు రాయలసీమ విద్యార్థుల విజ్ఞప్తి
రాయలసీమ వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉదయం మంత్రి రఘువీరా రెడ్డిని కలిశారు విభజన అనివార్యమైతే అనంతపురం, కర్నూలు జిల్లాలు తెలంగాణలో ఉండేలా చూడాలని కోరారు.
జివోఎం భేటీకి సీమాంధ్ర కేంద్రమంత్రులు
జివోఎంతో తెలంగాణ కేంద్రమంత్రుల భేటీ ముగిసినాక సీమాంధ్ర కేంద్రమంత్రులు హాజరయ్యారు. చిరంజీవి, పళ్లం రాజు, బొత్స ఝన్సీ, కిషోర్ చంద్రదేవ్, కావూరి సాంబశివ రావు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలం, కిల్లి కృపారాణి తదితరులు భేటీకి హాజరయ్యారు. సీమాంద్ర మంత్రులు ఆరు పేజీల నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications