రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంపై భారతీయ రైల్వే దృష్టిసారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లల్లో రిజర్వేషన్ కనఫర్మ్ కావాలంటే ఎంతో సమయం పడుతోంది. ఒక్కోసారి నెల, రెండునెలలకు పైగా వేచివుండాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లల్లో అయితే వెయిటింగ్ లిస్టు టికెట్లతోనే జనరల్ బోగీల్లో ప్రయాణించినట్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. 2027 ఏడాది నాటికి వెయిటింగ్ లిస్టు లేకుండా కన్ ఫర్మ్ గా టికెట్ పొంది ప్రయాణించవచ్చన్నారు. అందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రైల్వేల విస్తరణ ప్రణాళికలలో ప్రతిరోజూ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

By 2027, the authorities have written plans to ensure that every single passenger can travel without a waiting list after confirming a ticket.

దీపావళి సందర్భంగా ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఛట్ పూజ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించి 40 ఏళ్ల వ్యక్తి జారిపడి మృతిచెందారు. పండగల సమయంలో సొంతూళ్లకు పయనమయ్యే వారితో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది.

దీనికి శాశ్వత పరిష్కారం ప్రతి ఏడాది 4వేల నుంచి 5వేల కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,748 రైళ్లు నడుస్తున్నాయి. ఆ సంఖ్యను 13వేలకు పెంచబోతున్నారు. ఏడాదికి 800 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఈ సంఖ్యను వెయ్యికోట్లకు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రతి ఏడాది 225 రైళ్లు మనదేశంలో తయారవుతున్నాయి. వీటిలో పుష్ పుల్ సాంకేతికతను వాడుతున్నారు. వందే భారత్ రైళ్ల యాక్సిలరేషన్, డీసెలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+