నామినేటెడ్ పదవుల తొలి జాబితా సిద్దం : ఎవరికి ఏ పదవి దక్కిందంటే..
వైసీపీ నేతలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితా సిద్దమైంది. అందులో భాగంగా ఈ సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు విడుదల కానున్నాయి. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటించిన ముఖ్యమంత్రి తొలి జాబితాలో విశాఖ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సామాజిక సమీకరణాలు..స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయించినట్లుగా విశ్వస నీయ సమాచారం. అయితే, ఈ జాబితా తుది విడుదల సమయంలో కొన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు.

పక్కా సమీకరణాలు పరిగణలోకి..
జిల్లా యూనిట్ గా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా మహిళల కు 50 శాతం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక, నామినేటెడ్ పదవుల్లో విశాఖకు తొలి ప్రాధాన్యత 11మందికి చైర్మన్ పదవులను ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొంతమందికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం జీవోలు జారికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు నియోజకవర్గం) కు కేటాయించగా.. రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ( విశాఖ పశ్చిమ ) కు ఖరారు చేసినట్లు సమాచారం.

అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత
ఇక, నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు ( విశాఖ ఉత్తరం ) కేటాయించారు. రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్ గా జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం ) కి ఖరారైందని సమాచారం. రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ ( అనకాపల్లి ) కి కేటాయించారు. కీలకమైన విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ( విశాఖ ఉత్తరం ) కు ఖరారు చేసినట్లు విశ్వసనీయ ససమాచారం. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవికి కేటాయించారని తెలుస్తోంది.
Recommended Video

చివరి నిమిషంలో మార్పులకూ ఛాన్స్
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు (నర్సీపట్నం) కు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. అదే విధ:గా ..విశాఖ డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి ( గాజువాక ) ను ఎంపిక చేసారు. రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్ కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపు ( యలమంచిలి ) ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. వీటితో పాటుగా మరిన్ని పోస్టులకు సంబంధించి ఈ సాయంత్రం ఉత్తర్వులు వెలువడనున్నాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications