• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్నవరంలో వంశీ వైపే మొగ్గు - నో అంటున్న నేతలు : ఆ ఎమ్మెల్యేలు వైసీపీతో కొనసాగేనా..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అడుగులు వేస్తోంది. రెండేళ్లు ముందుగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. అయితే, మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్..ఇప్పుడు పాలనతో పాటుగా పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టారు. టీడీపీ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను నాటి అధికార పార్టీ తమతో కలిపేసుకుంది. అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టింది. ఈ అంశం పైన ప్రజల్లో టీడీపీ పట్ల వైసీపీ భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసింది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఫిరాయింపులు ప్రోత్సహించమని స్పష్టం చేసింది. ఎవరైనా ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేసింది.

వంశీకే పగ్గాలు.. సహాయ నిరాకరణ

వంశీకే పగ్గాలు.. సహాయ నిరాకరణ


కానీ, నలుగురు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. వారు టీడీపీకి రాజీనామా చేయలేదు. అదే సమయంలో అధికారికంగా వైసీపీలో చేరలేదు. కానీ, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల అసమ్మతి వారికి సమస్యగా మారుతోంది. అందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్థానిక వైసీపీ ముఖ్య నేతల నుంచి మద్దతు లభించటం లేదు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఎమ్మెల్యేతో సయోధ్యకు నో అంటున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, నియోజకవర్గ ఇంఛార్జ్ గా మాత్రం వంశీ కొనసాగుతారని వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇది..అక్కడ వైసీసీ నేతలకు రుచించటం లేదు.

కరణం బలరాం కు మద్దతు.. ముగ్గురి మధ్య పోటీ

కరణం బలరాం కు మద్దతు.. ముగ్గురి మధ్య పోటీ


ఇక, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాం వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన కుమారుడు వైసీపీ యాక్టివిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ పోటీగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇటీవల ముఖ్యమంత్రి ఆమంచిని పిలిపించి మాట్లాడి పర్చూరుకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అక్కడ వైసీపీకి మద్దతుగా నిలిచిన ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. ఆమంచి - కరణం బలరాం - పోతుల సునీత వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో..చీరాలతో అటు అద్దంకి ..మరో వైపు పర్చూరు రాజకీయాలు ముడిపడి ఉన్నాయి.

ఎవరి దారి వారిదే...

ఎవరి దారి వారిదే...


గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ నియోజకవర్గంలోనూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్..గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏసురత్నం.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. ఇక, టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుగా నిలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే సైతం రేసులో ఉన్నారు. ఇక, తాజాగా.. శాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి వైదొలిగారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కు..స్థానిక వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది.

వాసుపల్లి నిర్ణయంతో కొత్త చర్చ

వాసుపల్లి నిర్ణయంతో కొత్త చర్చ


వాసుపల్లి గణేష్‌ కు వైసీపీ ముఖ్యనేతల నుంచి కూడా మద్దతు లభించటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో..గెలిచిన పార్టీని కాదని..అధికార పార్టీకి దగ్గరైన వీరికి పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి మద్దతు లభించకపోవటం..అసమ్మతి సమస్యగా మారుతోంది. అదే సమయంలో..తిరిగి సొంత గూటికి వెళ్లే పరిస్థితి లేదు. మరి..వీరి విషయంలో వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో..వారికి ప్రాధాన్యత దక్కేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Vallabhaneni Vamsi and other three mlas who came from TDP facing problems with local ysrcp leaders. Now it became big discussion in political cirlces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X