మండుటెండల్లో అదిరిపోయే శుభవార్త
వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ తరుణంలో నైరుతి రుతుపవనాల గురించి వాతావరణశాఖ కీలక సమాచారాన్ని వెల్లడించింది. దక్షిణాసియా మొత్తం సాధారణంకన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్‌లుక్ ఫోరం తెలిపింది. పసిఫిక్ లో ఏర్పడిన ఎల్ నినో బలహీనపడి లానినో ఏర్పడుతోందని, ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఇండియాలో సాధారణంకన్నా అధికంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
వేడెక్కిన ఉపరితల జలాలు
ఎల్ నినో వల్ల పసిఫిక్ లో ఉపరితల జలాలు వేడెక్కి దేశంలో రుతుపవనాలను ప్రభావితం అవుతాయి. పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉంది. లానినా అనేది దీనికి పూర్తి భిన్నం. రుతుపవనాల సీజన్ లో సాధారణంకంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు. ఈ ఏడాది జూన్-సెప్టెంబరులో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణంకన్నా అధికంగా వర్షాలు కురుస్తాయి. అయితే ఈశాన్య, తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో తక్కువ వానలు కురుస్తాయి.

ఒక మోస్తరుగా ఎల్ నినో పరిస్థితులు
దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో సాధారణంకంటే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ అంచనాలను దక్షిణాసియాలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. దీనికి అంతర్జాతీయ నిపుణుల సహకారం కూడా తోడైంది. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు ఒక మోస్తరుగా ఉన్నాయని, నైరుతి మొదటి సీజన్ కు తటస్తమవుతుందని ఎస్ఏఎస్సీఓఎఫ్ అంచనా వేసింది. రెండో దశ నాటికి లానినా పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు భారత్‌లో రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయి అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు. ఉత్తరార్థ గోళంలో మంచు కవచం తక్కువగా ఉండటంతో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications