• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!!

|
  మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!! || Oneindia Telugu

  అమరావతి/హైదరాబాద్ : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్‌తో అటవీ ప్రాంతంలో జలపాతాలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్‌లలో నీళ్లు సమృద్ధిగా ఉండటం సహజం. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురవలేదు. ప్రకృతి ప్రకోపంతో కరువు తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చే వనరులు వట్టిపోయాయి. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలున్నాయి. ఇందులో నివసిస్తున్న మూగజీవాలకు నీటి సమస్య రావడం అత్యంత దారుణమైన పరిణామంగా జంతు ప్రేమికులు పరిగణిస్తున్నారు.

  వన్యప్రాణులు విలవిల..! దాహంతో జనారణ్యంలోకి పరుగులు...!!

  వన్యప్రాణులు విలవిల..! దాహంతో జనారణ్యంలోకి పరుగులు...!!

  జిల్లాలో ఉన్న అభయారణ్యాలలో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. చుక్కనీరు లభించికదాహంతో తట్టుకోలేక జనారణ్యంలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కుంటలుఎండిపోయాయి. భగభగ మండే ఎండలకు దాహంతో అలమటిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులుప్రత్నామ్నాయ చర్యలు తీసుకొని ట్రాక్టర్ల ద్వారా సాసర్‌ పిట్‌లలోకి నీరు నింపుతున్నారు.

  మండుటెండలకు అల్లాడుతూ..! అటవీ ప్రాంతంలో ఎండిన నీటి కుంటలు..!!

  మండుటెండలకు అల్లాడుతూ..! అటవీ ప్రాంతంలో ఎండిన నీటి కుంటలు..!!

  అటవీ ప్రాంతంలో మండుటెండలకు వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. చుక్క నీరు లేక వన్యప్రాణులు గ్రామాలవైపు పరుగులు పెడుతున్నాయి. అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పిలు, కొండ గొర్రెలు, అడవి బర్రెలు, అడవిపందులు, నెమళ్లు, చిరుతలు, పెద్దపులి, హనిబాడ్జర్,మనుబోతు, కణుజు, రోషకుక్కలు, తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లుతోపాటు ఇతర జంతువులు, పక్షులు నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటికి అవి సంచరించే ప్రాంతంలో దాహార్తిని తీర్చుకునేందుకు అవసరమైన పరిస్థితులు లేకపోవడంతోనే అవి అడవి దాటుతున్నాయి.

   రాత్రుల్లో నీటికోసం..! ట్రాక్టర్ల ద్వారా సాసర్‌పిట్‌లల్లోకి నీటితరలింపు..!!

  రాత్రుల్లో నీటికోసం..! ట్రాక్టర్ల ద్వారా సాసర్‌పిట్‌లల్లోకి నీటితరలింపు..!!

  అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీయడం కనిపిస్తోందని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హానీ ఉండదని, ఏనుగులతో హానీ ఉంటుందని చెప్పుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తీ తీర్చుకొని సేదతీరుతుంటాయి. గుక్కెడ నీటి కోసం నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి.

   వన్యప్రాణుల దాహార్తికి ప్రత్యామ్నాయ చర్యలు..! శేషాచలంలో సాసర్‌పిట్‌లో నీటిని నింపిన అటవీశాఖ..!!

  వన్యప్రాణుల దాహార్తికి ప్రత్యామ్నాయ చర్యలు..! శేషాచలంలో సాసర్‌పిట్‌లో నీటిని నింపిన అటవీశాఖ..!!

  శేషాచలం,పెనుశిల అభయారణ్యం, లంకామల్ల అభయారణ్యాలు ఉన్నాయి.ఈ అభయారణ్యాలలో ఉన్న వన్యప్రాణులకు దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలను అటవీశాఖ చేపట్టింది. అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సాసర్‌పిట్స్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అలాగే రాజంపేట డివిజన్‌ మొబైల్‌ సాసర్‌పిట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అభయారణ్యాలలో దట్టమైన ప్రాంతంలోని అక్కడక్క చిన్నపాటి కొలనులో నీరు ఉన్నప్పటికి అవి ఆవిరికావడంతో వన్యప్రాణాలు జనారణ్యంలోకి వస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In wildlife animals suffering from water. They do not tolerate the dangers and get into the public. Water ponds in the forest area have fallen. sunny weather is burning in the hot sunny thirst. Forest officials are taking practical steps to fill the water into saucer pitts through tractors.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more