నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాదు.. నారా రమేశ్, నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: విజయసాయిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాదు అని నారా రమేశ్ కుమార్ అని విమర్శించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు అని.. రాజ్యాంగబద్దమైన పదవీలో ఉంటూ నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టను ఆశ్రయిస్తామని కూడా పేర్కొన్నారు.
కనకపు సింహాసంపై శునకాన్ని కూర్చొబెడితే ఏం జరుగుతోంది... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌ను నియమించడంతో అదే జరిగిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ చర్య అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈసీ చేసిన చర్యను సుప్రీంకోర్టే తేలుస్తుందని చెప్పారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. కానీ రమేశ్ తనకు లభించిన స్వేచ్ఛ. రాజ్యాంగబద్ద అధికారాలను దుర్వినియోగం చేశారని విజయసాయిరెడ్డి ఫైరయ్యారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వాయిదావేయడంతో వివాదం రాజుకుంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. అధికార పార్టీ నేతలు రమేశ్ కుమార్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైరస్ ప్రబలుతుంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు.. అధికార వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications