ఎంపీ గీతకు హైకోర్టు నోటీసులు.. కుల వివాదం?
హైదరాబాద్: ఇటీవలే స్వైన్ ప్లూ బారిన పడి పూర్తిగా కోలుకుని బుధవారం పుట్టిన రోజు వేడుకలు జరపుకున్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి వివరాలు అందజేయాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మానసం ఆమెకు నోటీసులు జారీ చేసింది.
ఎంపీ గీతతో పాటు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఆమె అరకు ఎంపీగా గెలిచారని ఏపీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు కోర్టుకు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిన కొత్తపల్లి గీత ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications