లిక్కర్ కిక్కుకు రెఢీ, బంగాళఖాతంలోకి బూమ్ బూమ్, ప్రిస్టేజ్ మెడల్
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కిక్ ఎక్కించుకోవడాకి మందుబాబులకు రోజులు దగ్గరకు వచ్చేశాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అమల్లోకి తీసుకువచ్చిన నూతన మద్యం విధానానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త మద్యం షాపుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను జగన్ ప్రభుత్వమే నడిపింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు ప్రభుత్వం మాత్రమే నిర్వహించడానికి అప్పటి జగన్ ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టం చేసింది. ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ సవరించి కొత్త మద్యం విధానం అమలు చెయ్యడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ సవరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపింది.

ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని, తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానంలో 3,736 మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 10 శాతం మద్యం షాపులు కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఏఏ జిల్లాలలో కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించాలనే విషయంపై ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది.
ఇదే సమయంలో రాష్ట్రంలో నూతన మద్యం విధానంలో కొత్త మద్యం షాపులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కల్లుగీత కార్మికులకి కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ పక్కనపెడితే మిగిలిన మద్యం దుకాణాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంతకాలం బూమ్ బూమ్ బీర్లు, ప్రిస్టేజ్ మెడల్ విస్కీ, పేరు కూడా తిరగని పేర్లతో బ్రాందీలు తాగిన మందుబాబులు ఇకముందు వాళ్లకు నచ్చిన బ్రాండ్ లిక్కర్ తాగడానికి సిద్ధమవుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన రేట్లు పెట్టి నాసిరకం మద్యం మాతో తాగించారని, మా జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని, ఇప్పుడు మాకు మంచి రోజులు వస్తున్నాయని, తక్కు ధరలతో మాకు నచ్చిన మద్యం తాగుతామని, జల్సా చేస్తామని మందుబాబులు చిందులు వేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో కొత్తం మధ్యం పాలసి ఆమలులోకి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. .












Click it and Unblock the Notifications