హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెడు అలవాట్లు: నమ్మించి ల్యాప్‌టాప్‌ల చోరీ (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరుడుగట్టిన ల్యాప్‌టాప్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. హాస్టల్లోకి ప్రవేశించి ల్యాప్‌టాప్‌లను దొంగిలించే అలవాటు ఉంది. అతనిపై సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 15 కేసులు అతనపై పెండింగులో ఉన్నాయి. హైదరాబాదులోని గోల్నాకా ప్రాంతానికి చెందిన మోయిజ్ అలియాస్ సయ్యద్ తాబ్రెజ్ (20)ను పోలీసులు ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు మంగళవారంనాడు పట్టుకున్నారు.

అతని నుంచి పోలీసులు 5 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిగా హాస్టళ్లలోకి ప్రవేశించి విద్యార్థులు నిద్రిస్తున్న సమయాల్లో తెల్లవారు జామున ల్యాప్‌టాప్‌లను తీసుకుని ఉడాయించేవాడు.

Notorious offender Syed Tabrez apprehended

విద్యార్థిగా చెబుకుంటూ అతను ఇతరుల ఇళ్లలోకి కూడా ప్రవేశించేవాడు. ఇళ్లలోకి ప్రవేశించి మీ కుమారుడు నా స్నేహితుడని చెప్పుకుంటూ ఉండేవాడు. దొంగతనం చేసి చల్లగా జారుకుంటుండేవాడు. కస్టమర్‌గా సికింద్రాబాద్ సిటిసిలో ల్యాప్‌టాప్‌లను అమ్ముతూ వచ్చాడు.

విద్యార్థి అయినప్పటికీ సయ్యద్ తాబ్రెజ్ తాగుడు, పేకాట, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే అతను దొంగతనాలు చేస్తూ వచ్చాడు. ఎల్బీ నగర్‌లో ఐదు కేసులు, చైతన్యపురిలో ఐదు కేసులు అతనిపై ఉన్నాయి.

English summary
NOTORIOUS OFFENDER Syed Tabrez Moiz s/o Syed Nazeer, Age: 20/2014 yrs, R/o Golnaka, Amberpet and Mohd Shoeb (absconding), Hyderabadis apprehended at LB Nagar ‘X’ Roads and recovered (16) Laptops all worth Rs 5,50,000/- were seized in ( 15 ) cases of Cyberabad Police Commissionerate, Cyberabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X