చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ అప్రమత్తం - ప్రత్యేక చర్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపైన ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు భద్రతను కేంద్రం రెట్టింపు చేసింది. 12+12 ఎన్ ఎస్ జీ కమెండోలతో భద్రతను పెంచారు. ఇప్పుడు తాజాగా ఎన్‌ఎస్‌జీ అధికారులు పార్టీ కార్యాలయంతో పాటుగా చంద్రబాబ పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
భద్రతా పరమైన చర్యలను నిర్దేశించారు. చంద్రబాబు ఇంటిని భద్రతా అధికారులు పరిశీలించారు. చంద్రబాబు పర్యటనల సమయంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు..జిల్లాల పర్యటనలకు చంద్రబాబు సిద్దం అవుతున్న సమయంలో ఎన్‌ఎస్‌జీ అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక దృష్టి
కొద్ది నెలల క్రితం చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అప్పటికే టీడీపీ కార్యాలయం పైన దాడి.. అమరావతి పరిధిలో చంద్రబాబు పర్యటన సమయంలో బస్సు ను అడ్డుకొనే ప్రయత్నం వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో, కేంద్రం చంద్రబాబు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అప్పటి వరకు 6-6 గా ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, ప్రస్తుతం 12-12 ఎన్‌ఎస్‌జీ భద్రత మధ్య చంద్రబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ.. అటు చంద్రబాబు నిరంతరం సమావేశాలు నిర్వహించే పార్టీ ప్రధాన కార్యాలయం.. నివాసంలో ఎన్‌ఎస్‌జీ గ్రూపు కమాండర్ కౌషియార్ సింగ్ పరిశీలన చేసారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు గదిని.. ప్రచార రధాలను..రాత్రి పూట బస చేసే బస్సును కూడా ఆయన పరిశీలించారు.

భద్రతా పరంగా సూచనలు..
చంద్రబాబు పార్టీ కార్యాలయంలో సమీక్షలు చేసే హాల్ తో పాటుగా ప్రచార సమయంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఎన్‌ఎస్‌జీ అధికారులు సూచించారు. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనల వేగంగా పెంచాలని నిర్ణయించారు. దీంతో, సభలు - రోడ్ షోల కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రసంగాల వేళ.. ఎత్తుకు సరిపడా ఫైబర్ గ్లాస్ ఏర్ాపటు చేయాలని గ్రూపు కమాండర్ కొషియార్ సింగ్ సూచించారు.
గత మూడు నెలల కాలంలో చంద్రబాబు భద్రతా చర్యల్లో భాగంగా రెండో సారి చంద్రబాబు ఇంటిని..పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించారు. ఇవి సాధారణంగా భద్రతా పరంగా చేసే సమీక్షలుగా అధికారులు చెబుతున్నారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయంగా సమీక్షలు - సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. దీంతో, భద్రతా చర్యల సమీక్షలో భాగంగా ఈ పరిశీలన జరిగినట్లు తెలుస్తోంది.

నిలిచిపోయిన చంద్రబాబు వాహనం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే సమయంలో చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనం మొరాయించింది. దీంతో, కాన్వాయ్ లో ఒక వాహనం లేకుండానే చంద్రబాబు వెళ్లిపోయారు. వెహికల్ స్టార్టింగ్ సెన్సార్ మిస్ అవ్వటంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోనే బల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోయింది.
ఇక, చంద్రబాబు వచ్చే నెల నుంచి పార్టీ కార్యాలయంలోనే ఎక్కువ సమయం అందుబాటులో ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతీ నెల రెండు రోజులు జిల్లా పర్యటన ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎన్నికలకు కసరత్తులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications