ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ వ్యవహారంపై బీజేపీ గందరగోళం సృష్టించి పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో బిల్లు రాజ్యసభలోచర్చకు రాకుండా శుక్రవారం వాయిదా పడింది.

సాధారణంగా పార్లమెంకు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు వస్తున్నా, రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై పాస్ అవుతుందా? లేదా ఏమవుతుంది అంటూ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలైన రోజే కేవీపీ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుందన్న ప్రచారం సాగింది.

గత వారం రోజులుగా కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. శుక్రవారం చోటు చేసుకున్న తాజా పరిణామాలతో కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరగాలంటూ మరో రెండు వారాలు ఏపీ ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే సాధారణంగా ప్రైవేట్ మెంబర్ బిల్లులు నెలలో మొదటి మూడు వారాల్లోనే చర్చకు వస్తాయి కాబట్టి. దీనిని బట్టి చూస్తుంటే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరిగి మళ్లీ ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

అంతేకాదు అప్పుడు కూడా సభ్యులు సమన్వయంతో వ్యవహారిస్తేనే ప్రైవేట్ మెంబర్ బిల్లులపై చర్చ జరుగుతుంది లేదంటే మళ్లీ వాయిదా పడుతుంది. అయితే ఒక్క బిల్లుతో పార్లమెంట్‌లో 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్'గా నిలిచారంటూ కేవీపీపై సాటి ఎంపీలంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు.

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఒక్క బిల్లుతో దేశ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చకు తెర లేపడంతో పాటు, దుమారం లేపారని కేవీపీ నిరూపించారంటూ పలువురు ఎంపీలు వ్వాఖ్యానించారు. మరికొందరు ఎంపీలు మరో అడుగు ముందుకేసి ఈ రోజుకు ‘కబాలి' మీరే అని కేవీపీతో సరదా వ్యాఖ్యలు కూడా చేశారు.

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

కేంద్రప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాను కల్పించాలని ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందాలని కొరుతూ శుక్రవారం ఆశీల్ మెట్ట వద్ద సంపత్ వినాయగర్ ఆలయం వద్ద ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్వంలో 108 కొబ్బరికాయలు కొట్టారు.

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఒక్క బిల్లుతో ఫేమస్: కేవీపీని 'కబాలి'తో పోల్చిన ఎంపీలు

ఈ బిల్లుతో ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీ ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుందన్నారు. సోనియా గాంధీ పార్లమెంట్ భవనం తలుపులు మూసివేసి ఆశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపిస్తున్న బీజేపీ
ఇప్పటి వరకుూ ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At last the Congress is atoning for dividing the combined Andhra Pradesh inorganically by backing one-off move by party's Rajya Sabha MP, KVP Ramachandra Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి