కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహాం: ఆవిష్కరించనున్న వెంకయ్య
హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని జులై 5న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 29న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు.

జులై 1న వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా, భారత్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ మద్దతుదారుల సమావేశానికి హాజరవుతారు. జులై 3న డెట్రాయిట్ లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం మిచిగాన్ గవర్నర్ స్నియడర్‌తో కలిసి వ్యాపార సదస్సు ప్రారంభిస్తారు. డెట్రాయిట్‌లో తానా అందిస్తోన్న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆ తర్వాత జులై 4న లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications