జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు, జూన్ 4తర్వాత జగన్ సీఎంగా: లక్ష్మీపార్వతి ఆసక్తికరవ్యాఖ్యలు

ఎన్టీఆర్ 101వ జయంతి నేడు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. టీడీపీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సినీ పరిశ్రమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ చేసిన విశేష కృషిని కొనియాడుతున్నారు.

ఎన్టీఆర్ జయంతి నాడు లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మీపార్వతి దివంగత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించడం తో పాటు ఎన్టీఆర్ తరహా పాలన అందించడం ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని వ్యాఖ్యలు చేశారు.

NTR blessings to Jagan Jagan as CM after June 4th Lakshmi Parvathi interesting comments

జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి మంచి పరిపాలనే నడుస్తుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని, ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు.

గతంలోనూ ఎన్టీఆర్ జయంతి నాడు లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో కూడా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలలో అనేకసార్లు, అనేక సందర్భాలలో లక్ష్మీపార్వతి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఎన్టీఆర్ వేడుక జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న ఆమె కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కాబోరు అని వ్యాఖ్యలు చేశారు.

పీలో జగన్ నేతృత్వంలోనే మంచి పాలన
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే వ్యక్తి జగన్ మాత్రమేనని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఏపీలో జగన్ నేతృత్వంలోనే మంచి పాలన కొనసాగుతుందని ఆమె అన్నారు. ఇప్పుడు మళ్లీ మరో మారు ఎన్టీఆర్ తరహా పాలన ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అందించగలరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+