పవన్ ఓకే, ఆ ముగ్గురినీ ఎలా మరిచారు - చంద్రబాబు బిగ్ స్కెచ్..!?

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడకులను ఘనంగా నిర్వహిస్తున్నారు. పక్కా వ్యూహాత్మకంగా అథిదులను ఎంపిక చేస్తున్నారు. ఈ రోజు (శనివారం) హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల పైన భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ - సినీ ప్రముఖులను ఆహ్వనించారు. కానీ, ఎన్టీఆర్ - నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ముగ్గురుని మాత్రం విస్మరించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.

హైదరాబాద్ లో భారీ ఈవెంట్ : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా భారీ ఈవెంట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ కుకట్ పల్లిలో జరిగే కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలయ్య, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూ ఎన్టీఆర్, బన్నీ, వెంకటేష్ తో పాటుగా జయప్రద, గవర్నర్ బండారు దత్తాత్రేయ, దర్శక నిర్మాతలు హాజరవుతున్నారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం కారణంగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో తాను హాజరు కావటం లేదని తారక్ సమాచారం అందించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ను ఆహ్వానించి..తారక్ ను ఆహ్వానించక పోవటం పై విమర్శలు వచ్చాయి.

 cbnsrntr

అతిధుల ఎంపిక లెక్క పక్కా : పూర్తిగా చంద్రబాబు సూచనల మేరకే ఆహ్వాన కమిటీ పని చేసిందనే అభిప్రాయం బలంగా ఉంది. సినీ, రాజకీయ నేతల ఎంపిక వెనుక పక్కా లెక్క ఉంది. పవన్ కల్యాన్ ను రాజకీయ మిత్రుడుగా ఆహ్వానించారు. కానీ, ఎన్టీఆర్ శతజయంతి వేడకులకు చిరంజీవిని ఎందుకు ఆహ్వానించలేదనే చర్చ వినిపిస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్ ను ఆహ్వానించారు. వెంకేటేష్ ను ఆహ్వానించిన కమిటీ అక్కినేని వారసులను పిలవకపోవటం కూడా చర్చకు దారి తీస్తోంది. సినీ రంగంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఏఎన్నార్ తమ బాబాయ్ అని నందమూరి బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అక్కినేని కుటుంబానికి ఆహ్వానం ఉన్నట్లుగా కనిపించటం లేదు. ఎక్కడా ఆ ప్రస్తావన లేదు.

ఏపీ సమీకరణాలే కీలకం : రాజకీయాలకు అతీతంగా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. బీజేపీ నేతలను ఆహ్వానించారు. మరి..సీఎం కేసీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ తో కలిసి పని చేసారు. ఎన్టీఆర్ జన్మదిన, వర్దంతి నాడు బీఆర్ఎస్ నేతలు నివాళి అర్పిస్తున్నారు. బీజేపీ నేతలను ఆహ్వానించిన కమిటీ బీఆర్ఎస్ నేతలను ఎందుకు ఆహ్వానించలేదనేది మరో చర్చ. హాజరవుతారా లేదా అనే అంశం పక్కన పెడితే ఆహ్వానం పైనే చర్చ సాగుతోంది. దీంతో..ఏపీలో ఎన్నికలు..బీజేపీ, జనసేనతో పొత్తు..పక్కా లెక్కలతోనే అతిధుల ఎంపిక జరిగినట్లు స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి ఈ తరం యువ హీరోలను అతిధులుగా ఎంపిక చేయటం వెనుక ఏపీ సమీకరణాలే కీలకంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+