పవన్ తో కలిసి నందమూరి కుటుంబం, ఒక్కరు మినహా - చంద్రబాబు కోరుకున్నదే..!!
వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం పొత్తుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చింది. కలిసి వస్తే బీజేపీ లేకుంటే టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా నందమూరి కుటుంబం రాజకీయంగా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేళ రాజకీయ పార్టనర్ పవన కల్యాణ్.. నందమూరి కుటుంబాన్ని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నారు. ఒక్కరు మినహా.
సభపై ఆసక్తి : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల పైన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను శతజయంతి వేడకల కమిటీ ఆహ్వానించింది. ఈ కార్యక్రమం మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో సహా నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా శతజయంతి వేడుకకు హాజరు కావటం లేదని జూ ఎన్టీఆర్ టీం వెల్లడించింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ హాజరవుతున్నట్లు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్, ప్రభాస్ ను ఆహ్వానించారు. వారి రాకపైన స్పష్టత రావాల్సి ఉంది.

ఎవరెవరు పాల్గొంటారు : 2014 లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతిచ్చినా..ఆ సమయంలో నందమూరి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన లేదు. నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం నందమూరి బాలయ్యతో పాటుగా మరో ఇద్దరి పేర్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో ఎన్నికలకు ముందుగానే పవర్ స్టార్ - నందమూరి అభిమానులను తమకు మద్దతుగా మలచుకొనేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకొనే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా గతంలో ఒక ఓటీటీ వేదికగా బాలయ్య - పవన్ కల్యాణ్ టాక్ షో కు మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులతో వేదిక పంచుకోనున్నారు.
ఏం జరగబోతోంది : ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పాల్గొనటం ద్వారా 2024 ఎన్నికల పొత్తు ఇక్కడి నుంచే మొదలు కానుందా అనే చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని పెంచుతున్న ఈ సమావేశం భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి వేస్తున్న అడుగుల్లో భాగమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగానే ఆహ్వానాలు..సభ నిర్వహణ జరుగుతోందనే అభిప్రాయం ఉంది. దీంతో, ఈ సభలో ఎవరెవరు పాల్గొంటారు, ఏం మాట్లాడుతారు.. ఎవటువంటి సమీకరణాలను ఈ వేదిక కారణంగా నిలవనుందనే చర్చ మొదలైంది. ఈ ఆసక్తి కర అంశాల నడుమ ఈ సభ పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications