నా సలహాతోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు: చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు:వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని అందుకే ఎన్టీఆర్ ను పార్టీ పెట్టాలని కోరారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

పార్టీ ఆవిర్బావదినోత్సవాన్ని పురస్కరించుకొని బుదవారం సాయంత్రం గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులను ఆయన గుర్తు చేసుకొన్నారు.

chandrababu naidu

ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలని సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్ల కాదని, మీలాంటి వారు రాజకీయాల్లొకి వచ్చి వ్యవస్థను మార్చాలంటూ ఎన్టీఆర్ కోరానని ఆయన చెప్పారు.

తన సలహా వల్లే ఎన్టీఆర్ పార్టీని పెట్టారని ఆయన చెప్పారు.తాను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్నారు బాబు. తాను అనారోగ్యం పాలైతే రాష్ట్రానికి కూడ సుస్తీ చేస్తోందని చెప్పారు.

తాను ఖచ్చితంగా ఆహార నియమాలను పాటిస్తానని చెప్పారు. ఆహార నియమాల విషయంలో తన భార్య చేతిలో రిమోట్ ఉంటుందన్నారు. తాను బతకడానికి తింటానని, తినేందుకు బతకనని ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ntr estblish party with my adivce said andhra pradesh chief minister chandra babu naidu on wednes day evening. he has participated in party foundation celebrations at guntur
Please Wait while comments are loading...